'రెండురెళ్ళు నాలుగు' - చిలుకూరి దేవపుత్ర గారు.

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి.'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ. దేవపుత్ర గారి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన , అన్వేష్ గారికి , దీవెన గారికి కృతజ్ఞతలు. దేవపుత్ర గారి కథల పుస్తకాలు కొనేందుకు - https://bit.ly/3uOdH7Bబస్సు వేగం పుంజుకుంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట అవుతోంది. ఎండాకాలం అయినందువల్ల సూర్యుడు తన తాపాన్నంతా భూమి మీదే చూపిం చేస్తున్నాడు. షి సాగర్ చేరుకునేటప్పటికి ఎన్ని గంట లవుతుందో? మళ్లీ అక్కణ్ణించి గౌహతికి సాయంత్రం లోగా చేరుకోగలనా? నేను అస్సాం వచ్చాక గౌహతికీ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మాత్రమే క్యాంపులు వెళ్ళాను. దాదాపు రెండు వందల కిలో మీటర్ల దూరం ఉన్న షబ్నగర్ కి క్యాంపు వెళ్ళటం ఇదే మొదటిసారి.కిటికీ పక్కనే కూచుని ఉన్నందువల్ల అందాన్నంతా హాయిగా గమనిస్తున్నాను. ఒకవైపు లోయలూ, మరో వైపు కొండలూ చూస్తుంటే 'బస్సు నిలిపేసి ఇక్కడే ఉండిపోతే ఏం' అనిపిస్తోంది. ఇది దురాశేనని తెలుసు. గౌహతిలో నళిని రాత్రికల్లా వచ్చేస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది.నా సీటు వెనకాల నుంచి గలగలమంటూ అమ్మాయి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. నేను తిరిగి చూడలేదు..“ఇక జోకులు వెయ్యకు బాబూ, నా చేత కాదు. నవ్వలేక చస్తున్నా” నవ్వు నాపుకుంటూ అమ్మాయి గొంతు.“అప్పుడే ఏమయింది.. ఇంకా ఎన్ని జోకులున్నా యని" మగ గొంతు.“ఇక్కడ వీళ్ళంతా ఏమనుకుంటారు?" ఆడ గొంతు.“వీళ్ళ మొహం... తెలుగు అర్థమయి ఛస్తేగా వీళ్ళకి” అంటోంది గర్వంగా మగగొంతు.నేను వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేక పోయాను.అమ్మాయి నల్లగా ఉన్నా - అందంగా ఉన్న మొహం, తళతళలాడే పలు వరుస, వెన్నెల చిందే కళ్ళూ ఉన్నాయి. అబ్బాయి మాత్రం వంకీల జుత్తుతో, లావాటి మీసకట్టుతో, ఎర్రగా బుర్రగా ఉన్నాడు చూడగానే కొంటె కుర్రాడు అనిపించేలా ఉన్నాడు.“మన ముందు సీటులో మనిషి చూడూ... వెనక్కి తిరిగి మనల్ని..” అంది అర్దోక్తిగా ఆమె. "“కోతిమొహం కొండముచ్చు వెధవ... ఎలా ఉన్నాడో చూడు" అంటూ నా భుజం తట్టి అస్సామీ భాషలో ఏదో మాట్లాడాడు. నాకా భాష అర్థమయి ఛస్తేగా, పళ్ళికిలించి వెర్రినవ్వు నవ్వాను. ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడేశాననుకోండి, వాడు ఇందాక తిట్టాడే 'కోతి మొహం' అన్న తిట్టు నాకు వర్తించినట్టు వాళ్ళెక్కడ అనుకుంటారోనని నా భయం. ఆ "నేను చెప్పలా ఇక్కడ ఎవ్వరికీ తెలుగురాదని... మనకిష్టమొచ్చినంత సేపు తిట్టినా ఏం ఫర్వాలేదు. “ఒరే! ముందుసీటు ముసంగి వెధవా! మేమిద్దరం ఆలు మగలంరా! ప్రేయసీ ప్రియులు అనుకు న్నావా! అంత అనుమానంగా చూస్తున్నావు” అతడు ఆ పద్ధతిలో వెటకరింపుగా మాట్లాడుతోంటే, ఆ అమ్మాయి పకపక పగలబడి నవ్వుతోంది.వాళ్ళు సరదాగా, హాయిగా ఉండడం బాగానే ఉంది కానీ... వాళ్ళ సరదాకు నన్నే ఉపయో గించుకోవటం నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది.నా భుజం మీద మళ్ళీ చేయి పడితే తిరిగి చూశాను. “భోజనం అయ్యిందా?” అన్నట్టు చేత్తో సైగచేస్తూ 'తన్నులు కావాలా?" అని తెలుగులో అడుగుతున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతోంది.అంటే, అతను ఆమెను నవ్వించటానికి నన్ను తమాషా పట్టించే ప్రయత్నంలో చాలా ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాడన్నమాట. నేను గమ్మున చూస్తూ 'ఆఁ' అన్నాను. 2. "కమలా! చూడు వీణ్ణి ఇంకా ఎలా ఆడించేస్తానో!” అంటూనే అతను 'నీళ్ళు కావాలా?! అన్నట్టు సంజ్ఞ చేస్తూ - "కీళ్ళు విరిచేస్తా. ఏమిటలా చూస్తావు గుడ్లగూబలా... బుద్దుందా? పెళ్ళి చేసుకున్నావా? వెధవ నాయాలా... కాలేదూ... పోనీ ఉంచుకున్నావా ఎవర్నయినా?” అని అతడు వాగుతూ ఉంటే, 'ఆఁ ఆఁ జీహాఁ' అన్నాను - వెర్రినవ్వు ఒలక బోస్తూ తల తిప్పేసుకున్నాను. ఆ అమ్మాయి పడీ పడీ నవ్వుతోంది.బస్సులో అందరూ తలలు తిప్పి ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. - "ఏంట్రా కూస్తున్నావ్?" అని నేను తెలుగులో అడిగితే అతని పరిస్థితీ, ఆ అమ్మాయి పరిస్థితీ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను.