డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు.చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.వాసిరెడ్డి నవీన్ గారి గురించి:'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో సమీక్ష వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో 'తెలుగు కథా సాహితి' అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, 'కథా సంకలనాలను వెలువరిస్తున్నారు నిర్విరామంగా.ఆయన గురించి మరికొన్ని వివరాలు (http://bit.ly/36b8Kfw) .హర్షణీయం లో ఇంతకు ముందు ప్రచురించిన 'నైట్ డ్యూటీ' అనే కథ కూడా ఒక వాస్తవ సంఘటన ప్రేరణ గా తీసుకొని శ్రీ.చంద్రశేఖర్ రావు గారు రాయడం జరిగింది.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy