'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన !
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండిhttps://www.telugubooks.in/products/the-best-of-yandamoori-veerendranathహర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1ఆ రాత్రి - అయోధ్య నిశ్శబ్దంతో సయోధ్య చేసినట్టుంది.శ్రీహితుడికి కన్ను మూత పడటంలేదు. మెత్తటి పాన్సు అంపశయ్యలా తోచింది. కొంచెం సేపు నిదురించే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కూర్చుంటున్నాడు. అంతకు మునుపే, దూరంగా రోదన వినిపించింది. వినిపించిన వైపు వెళ్ళాడు.సరయూ నది ఒడ్డున ఒకామె రోదిస్తూ కనబడింది. “ఎవరు తల్లీ నీవు? ఎందుకు రోదిస్తున్నావు?” అని అడిగాడు. "నాయనా! నేను నిద్రాదేవిని. నిన్ను సమీపించుటకు చేతకాని అవమాన భారంతో రోదిస్తున్నాను” అన్నది.ఆమె రోదనకు సరయూనది గలగలలు ఉపశృతులు అవుతున్నవి. ఏమి చేయాలో తోచనట్టు నిలబడినాడు.అంతలోనే అతడికి మెలకువ వచ్చింది. అంతా కల అని తెలిసింది. మళ్ళీ అనుమానం నిదుర రాకపోతే కల వుండదుకదా. మరి అది కలా? లేక తన భావావేశమా? అంతా అయోమయమే! ఈ అయోమయం వేకువ నుంచీ వున్నది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఊరికే ఉండబుద్దికాదు. కాలు ఒక చోట నిలువదు. అది నిలుచున్నా మనసు నిలవదు. అవును మరి అతడికి అలజడికి కారణమున్నది.రాముడు బయల్దేరినాడట. పుష్పక విమానంపై సీతా సమేతుడై వస్తున్నాడట. రావణ సంహారానంతరం అయోధ్యలో అడుగిడుతున్నాడట.- శ్రీహితుడికి ప్రస్తుతం ఇరవయ్యేళ్ళ ప్రాయం. అతడి తల్లి కైకేయి వద్ద ముఖ్య పరిచారిక. తండ్రి దశరధ రథ చోదకుడు.అతడికి గతము బాగా గుర్తున్నది. అప్పుడతడికి ఆరో వసంతము. ఆడవారితో వామన గుంటలు, ఈడు వారితో కోతి కొమ్మచ్చులు ఆడుకునేవాడు. ఆరోజు ఎవరూ అతనితో ఆడేటందుకు రాలేదు. పలకరించనయినా లేదు. అంతా దుఃఖ సాగరంలో మునిగి వున్నారు. ఆటకెవరూ తోడు లేనందున అతడికి కోపము వచ్చింది. కసి పెరిగింది. బిక్కు - బిక్కు మంటూ ఒక్కడే కూర్చున్నాడు. గదిలో ఒక మూల తల్లి రోదిస్తున్నది. - అంతలో పుర వీధిలో కలకలం వినిపించింది. పరుగు పరుగున బయటకొచ్చాడు. ఆ దృశ్యాన్ని అతడు, తరువాత జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు.నార బట్టలతో రాముడు, సీతతో కలిసి నడుస్తున్నాడు. లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు. వెనుక అయోధ్య నడుస్తున్నది. శ్రీహితుడు కనులు పెద్దవి చేసుకుని చూసాడు. అతడి పసి మనసుకి అర్థం కాలేదు. పరుగెత్తుకుపోయి, “అమ్మా! అందరూ వూరొదిలి పోతున్నారే” అన్నాడు. తల్లి అతడి పొదివి పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె దుఃఖమునకు మరొక కారణము కూడా వున్నది.కైకను తిట్టనివారు లేరు. ముఖ్య పరిచారక కాబట్టి ఆమెది కూడా తప్పన్నటు తూలనాడారు. ఆ తల్లి దుఃఖం అందుకే. శ్రీహితుడికి తల్లి దుఃఖం అర్థం కాలేదు. తనూ ఏడ్చినాడు.ఎప్పటిమాట అది! పధ్నాలుగు వసంతాల క్రిందటి మాట!ఆ తరువాత రాముని కథలు ఒకటి తరవాత ఒకటి విని పులకించి పోయినాడు. వాస్తవముకంటే ఊహ గొప్పది కదా! శ్రీహితుడి మనసులో శ్రీరాముడట్లే పెరిగిపోయినాడు. కథలన్నీ తల్లే చెప్పినది.రాతిని నాతిగ చేసినాడని చెప్పగ నోటిని తెరుచుకు విన్నాడు. దండిగ నసురుల చెండిన రాముని, కంటికి నిండుగ వూహించుకున్నాడు. ధనస్సు వంచిన దనుజభిరాముని మనస్సునందే నింపుకొన్నాడు.ఆ విధంగా రాముడు, శ్రీహితుడి మనసులో వయసుతో పాటే ఎదిగినాడు. అటువంటి రాముడు ఈ రోజు.... ఇన్నాళ్ళకి వస్తున్నాడంటే నిద్ర ఎలా పడుతుంది?లేచి బయటకు వచ్చాడు.శ్రీహితుడికి అయోధ్య మీద చాలా కోపంగా వుంది. దానికి కారణం కూడా వున్నది. రాముడొస్తున్న రాత్రి, ఇంత హాయిగా అందరూ ఎలా నిద్ర పోతున్నారన్నదే ఆ కారణం.అంతకు ముందు రోజే భరతుడు అగ్ని ప్రవేశం చేయబోయాడు. పదునాలుగు సంవత్సరములు దాటినా రాముడు రాకపోయే సరికి ప్రాణాలు తీసుకోబోయాడు. అంతలో హనుమంతుడొచ్చి రామాగమన సందేశాన్ని వినిపించాడు. -అంతే! ఆ క్షణము నుంచీ అయోధ్యలో ఎవరికీ నిద్రాహారాలు లేవు. నగరాన్ని అలంకరించటము ప్రారంభించారు.కౌసల్య కళ్ళలో తెలి మంచుముత్యాలూ, సుమిత్ర కళ్ళల్లో మణిదీపాలు వెలిగితే, కైకకి వళ్ళంతా...