మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో. సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది, అమ్మగార్ల బడి కేవలం అమ్మాయిల బడి కావటంతో. నా ప్రవేశం అంత సులువుగా జరగలా. శ్రీ సుబ్బారావు గారు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. నా ఏడవ తరగతి మార్కులు ఆ బడిలో చదివి ప్రధమ స్థానం సంపాదించిన మల్లికార్జున వర ప్రసాద్ కంటే మూడు మార్కులు ఎక్కువ అవటం ఆయనకీ నచ్చలా. అందులోను నేను వచ్చినది మారు మూల పల్లెలో వున్నజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవటంతో ఆయనకు గట్టినమ్మకం అక్కడ మాస్ కాపీయింగ్ జరిగి ఉంటుంది అందుకే నాకు అన్ని మార్కులు వచ్చి ఉంటాయి అని. ఆయన నాకు ప్రవేశం ఇవ్వడానికి సుముఖంగా లేరు. నాకు ఆయన నన్ను తిప్పించుకోవటం చాలా ఉక్రోషంగా వున్నది. ఆయనేమో చాలా చిన్న వయస్సులోనే గెజెటెడ్ ర్యాంకు కల ప్రధానోపాధ్యాయ పదవిని అధిరోహించిన సింహ స్వరూపుడు. అయినా ధైర్యం చేసి చెప్పేశా మీరు ఏ పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పరీక్ష పెట్టుకోండి, నేను మాత్రం ఈ బడిలోనే చదువుతాను అని. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం మరల పరీక్ష రాసిన కొద్ది మంది లో నేను ఒకడినేమో, అలా పరీక్ష పెట్టిన మహా చాదస్తపు ప్రధానోపాధ్యాయుల వారు ఆయనేమో. ఆయన ఏర్పరిచిన ఉపాధ్యాయులు పెట్టిన ప్రవేశ పరీక్షను విజయవంతముగా గట్టెక్కిన నన్ను ఆయన లెక్కలు బోధించే బి-సెక్షన్ లోనే వేయించుకున్నారు పట్టుబట్టి మరీ నీ సత్తా మేమిటో చూస్తా సంవత్సరమంతా అని. అలా బి-సెక్షన్ లో ప్రవేశించిన నన్ను ఏడవ తరగతిలో ఆ బడికి ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన మల్లిగాడు మరియు రమణుడు త్వరగానే నన్ను వారి వారి మిత్ర బృందాల్లో కలిపేసుకున్నారు. వారి వారి బృందాలు అని ఎందుకు అన్నాను అంటే మా మల్లిగాడు మరియు రమణుడు అచ్చు టామ్ మరియు జెర్రీ లాటి వారు. ఈ ఇద్దరే కాకుండ మా తరగతిలో ఇంకో పాపులర్ ఫిగర్ సయ్యద్ ఆన్సర్ బాషా. అప్పటి దాకా వీళ్లిద్దరి రాజకీయాలకు బలి అయ్యి, ఒక్కోసారి మల్లిగాడి పార్టీ లో ఉండాలా లేక రమణుడి పార్టీ లో ఉండాలా అని సతతమయ్యే వీడికి నాది మరియు మా ఇంకో మిత్రుడు లక్ష్మిపతి రాక ఒక వసంతం. ఎందుకంటే మేము ముగ్గురం ఒక బలమైన తృతీయ ఫ్రంట్ ని స్థాపించాము అటు పిమ్మట కాబట్టి. ప్రస్తుతానికి ఈ కథ జెర్రీ లాటి వాడైన మా మాయదారి మల్లిగాడు గురించే. వీడు అసలు ఏమాత్రం ఆవేశ పడకుండా అవతల వాళ్ళని గిల్లేస్తాడు. అందులోను నన్ను, మా రమణుడిని గిల్లటమంటే వీడికి మహా సరదా. నేను ఎనిమిదవ తరగతిలో చేరే సరికి వీడు మహా పాపులర్ ఫెలో. ఏడవ తరగతిలో పాఠశాల కల్లా ప్రథముడు కావటం, వాళ్ళ అమ్మ నాన్న గార్లు మా బడికి అనుబంధమైన బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్స్ కావటంతో టీచర్స్ కి వీడంటే ఒకవిధమైన ప్రేమ. రాజు మరియు వరప్రసాద్ వీడి ముద్దు పేర్లు. నేను చేరిన వెంటనే నన్ను వీడి బ్యాచ్ లో కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే నాకు ఒక్కో రహస్యాలు చెప్పేవాడు. అందులో భాగంగా మా ఆన్సర్ గాడి గురించి చెప్తూ, "ఆ ఆన్సర్ గాడితో ఎప్పుడైనా గొడవపడు, కానీ రంజాన్ మాసానికి కనీసం ఒక వారం ముందు అయినా వాడి దగ్గర తెల్ల జెండా ఎత్తెయ్యి, ఎందుకంటే వాడు రంజాన్ విందుకి వాడి స్నేహితులను అందరిని పిలుస్తాడు. ఆహా ఆ బిర్యాని, ఆ సేమియా పాయసం తినటానికి ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చురా అని". ఈ ప్రబోధాన్ని నేను ఇప్పటికీ ఫాలో అయిపోతుంటా. మనకి లెక్కలంటే మహా భయం, అసలు అవి రావని గట్టి నమ్మకం. వీడు నాకు లెక్కలు చూపితే నేను వీడికి ఇంగ్లీష్ లో హెల్ప్ చేయాలనేది మా ఒప్పందం. ఇంగ్లీష్ లో హెల్ప్ చేయించుకొని లెక్కలకి నాకు హ్యాండ్ ఇచ్చేవాడు. అలా హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా నేను వాడిని ఒక