'షరా' - గోపీచంద్ గారి రచన
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsbఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్వరితోనూ పరిచయం లేదు. నేను ఎన్నడూ ఆ లంకలో అడుగుపెట్టి కూడా ఎరగను.మా ఊరు బెజవాడ దగ్గరదే అయినా నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచీ మద్రాసులోనే వుంటున్నాను. ఈ ప్రాంతాలకు రాలేదు. ఇటీవల వొచ్చిన గాలివానకు పంటలన్నీ పాడైనయ్యని తెలుసుకొని పొలాలు చూచుకు వెళ్ళదామని వొచ్చాను. గాలివానవల్ల నిజంగా అపారమైన నష్టం కలిగింది. నేను ఎరిగినతర్వాత ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. కవులు వాళ్ళు తమ గింజలుకూడా రావని గోలపెడుతున్నారు. నేను ఏమి చెయ్యగలను! మళ్ళీ మద్రాసు వెళ్తామని బయలుదేరి, ఎలాగూ వచ్చాంగదా అని బెజవాడలో వున్న నా మిత్రుణ్ణి వొకణ్ణి చూచిపోదామని బెజవాడలో దిగాను. అతను గాలివానకు నష్టపడిన వారికి సహాయంచేసే ప్రయత్నంలో వుండి “రేపు వెళ్ళొచ్చులే” అంటే-ఆనాటికి ఆగిపోయాను.ఆ సాయంత్రం బెజవాడ లంకలో నష్టపడ్డ బీద జనానికి వాసాలూ, తాటాకులూ పంచిపెడుతూ నన్ను కూడా రమ్మంటే నేనూ వెళ్ళాను. శరణార్థుల్లో కనుపించాడు ఆ మనిషి. ఆ మనిషి నన్ను చూచి కొంచెం బెరుకుపడ్డట్టు కూడా అనిపించింది నాకు. నిజంగా ఆ మనిషిని నేను ఎక్కడో చూశాను. అందులో సందేహం లేదు. కాని ఏ సందర్భంలో చూశానో ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రాలేదు.మేము పని పూర్తి చేసుకొని యింటికి వస్తుంటే ఒక రైతు మా వెంట వొచ్చాడు. అతనివల్ల ఆ మనిషి కోటిరెడ్డి మామ అని తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కోటిరెడ్డిని నేను ఎరుగుదును. అతనూ మద్రాసులోనే ఉంటున్నాడు. అతని మామను కూడా నేను ఎరుగుదును. ఒకసారి అతని అత్తవారి ఇంటి దగ్గర ఉండగా అతన్ని చూద్దామని వెళ్ళాను. అప్పుడే ఈయన్ని చూశాను. కాని గుర్తుపట్టకపోవటం నాతప్పు కాదు. మనిషి చాలా మారిపోయాడు.నేను ఏట్లాగూ మద్రాసు వెళుతున్నాను గనక అల్లుడికేమైనా కబురు చెబు, మర్నాడు ప్రొద్దున్నే లేచి కోటిరెడ్డి మామను చూద్దామని లంకకి ప్రయాణ ఆ లంకలో వుంటున్నదంతా అలగా జనం. నాకు తెలిసినంతవరకు కోటిరెడ్డి వున్నవాడే. కాని ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. స్వగ్రామంలో ను వాకిలి వొదులుకొని ఇక్కడ ఎందుకు కాపరం పెట్టాడో కూడా నాకు తెలియదు. కోటి కూడా ఈ విషయం నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు. అక్కడ వున్నవన్నీ చిన్న చిన్న హరి గుడి సెలే. ఆ గుడిసెల్లో వొక గుడిసెలో కాపరం వుంటున్నాడు కోటిరెడ్డి మామ. నేను వెళ్ళేటప్పటికి ఆస్థలంలోనే వున్న మరికొన్ని గుడిసెల్ని బాగుచేయిస్తున్నాడు. నన్ను చూచి కొంచెం తబ్బిబ్బుపడ్డాడు. ఇంటిలోకి వెళ్ళి నేను కూర్చోగలందులకు ఒక కుక్కిమంచం తెచ్చాడు. అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత హీనస్థితికి ఎందుకు వొచ్చాడా అని ఆలోచించ బుద్ధి ఐంది. మాటల్లోకి దింపాను. అతను ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబులు చెప్పాడు. తన అల్లుడి సంగతి అడిగాడు. బాగానే వున్నాడని చెప్పాను. నేను అదీ, ఇదీ అడిగాగాని సరైన జవాబులు చెప్పలేదు. చివరికి; “నేను మద్రాసు వెళ్తున్నాను మీ అల్లుడికి ఏమైనా కబుర్లు చెపుతారా?” అని అడిగాను.“ఇట్లా వుంటున్నామని చెప్పండి” అన్నాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని మిత్రుని ఇంటికి బయలుదేరాను. దారిలో ముందురోజు కలిసిన రైతు కలిశాడు. అతన్ని అడిగాను. కోటిరెడ్డి మామనుగురించి.“ఆయన ఆస్తి ఎందుకు పోయింది?” అని అడిగాను. “ఆస్తి పోవటం ఏమిటండోయ్!” అన్నాడు ఆ రైతు. “ఆస్తిపోకపోతే ఈ గుడిసెలో వుండవలసిన అవుసరం ఏమొచ్చిందీ?” అన్నాను.“అదా అండి… అట్లా అడగండి” అన్నాడు రైతు. అని ఈ విధంగా చెప్పాడు; “ఏమండోయ్ నాదీ ఆయనది వొక ఊరే… తెలుసా అండి… నాకాయన సంగతి బాగా తెలుసు… ఆస్తిపోయి రాలేదు….”“మరెందు కొచ్చాడు?”“సంపాదించటానికి వొచ్చాడు. అక్కడ ఇల్లూ, పొలం అమ్ముకొని వడ్డీకిచ్చి ఈ లంకలో స్థలాలు చౌగ్గా వున్నాయనీ, తొందరలో ధరలు పెరుగుతాయని తెలుసుకొని, ఇక్కడ స్థలం కొన్నాడు… రేపీ స్థలం అమ్ముతాడు… ఇంకొకచోట కొంటాడు… ఆయన కేమండీ… చూశారూ… ఈ స్థలం కొన్నాడా… కొని ఊరికేవుంటి యేమొస్తుందని నాలుగు గుడిసెలు వేయించి అద్దెకిస్తున్నాడు… కాని గాలివాన వొచ్చింరోజే గమ్మత్తంటే గమ్మత్తు…” అని నవ్వటం మొదలు పెట్టాడు.కారణం తెలియకపోయినా, అతను నవ్వుతుంటే నాకూ నవ్వు వొచ్చింది. “ఏం జరిగిందేమిటి?” అని అడిగాను.“అంతకు ముందు...