'బ్లూ అంబ్రెల్లా'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల.ఈ పుస్తకంనించి, 'బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు.'Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్.అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. : http://bit.ly/anilbattulapillalacinemakathaluభారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 9 యేళ్ల బినియా అనే అమ్మాయి, వస్తాదు ఐన తన అన్నయ్య, వాళ్ల అమ్మతో కలిసి నివసించేది. వాళ్ల గ్రామం కొండప్రాంతంలో వుండేది. బినియా వాళ్లకి గోరీ, నీలూ అనే రెండు ఆవులు వుండేవి. పాప ఆ ఆవుల్ని కొండ వాలులోని పచ్చ గడ్డితో మేపేది. పాడి వాళ్ల జీవనాధారం. బినియాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అదే గ్రామంలో నంద కిషోర్ అనే 50 యేళ్ల వ్యాపారి, రహదారి పక్కన 'ఖాత్రి టీ దుకాణం నడిపేవాడు. ఇతను పరమ లోభి. బడికెళ్లే పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అప్పు ఇచ్చేవాడు. నెల అవ్వగానే పిల్లలకు తప్పు లెక్కలు చెప్పి వాళ్ల దగ్గర ఏదో ఒక వస్తువు (ఉదాహరణకు బైనాక్యులర్స్ లాంటివి) లాక్కునేవాడు. ఇతని దగ్గర రాంగోపాల్ అనే దొంగ పిల్లవాడు పనిచేసేవాడు.ఒక రోజు బినియా ఆవుల్ని మేపటానికి కొండపైకి వెళ్తుంది.. అక్కడ తనకి ఒక అందమైన పెద్ద నీలంరంగు జపనీస్ గొడుగు దొరుకుతుంది. అది ఒక జపనీస్ టూరిస్ట్ బృందం వాళ్లది. వాళ్లు పాప మెడలోని ఎలుగుబంటి గోరుతో చేసిన దండని తీసుకుని దానికి బదులుగా ఈ అందమైన నీలంరంగు జపనీస్ గొడుగును ఇస్తారు. ఎలుగుబంటి గోరుతో చేసిన దండని అదృష్టచిహ్నంగా భావిస్తారు. అది దుష్ట శక్తులను పారద్రోలుతుందని ప్రజల నమ్మకం. గొడుగు కోసం దండను ఇచ్చినందుకు అమ్మ పాపను మందలిస్తుంది. ఆ నీలంరంగు గొడుగు రాగానే బినియా ఆ వూర్లో ఒక సెలబ్రిటీ అవుతుంది.. ఎందుకంటే ఆ వూర్లో వున్నవన్నీ నల్లని సాధారణ గొడుగులే. ఇంత అందమైన నీలంరంగు జపనీస్ గొడుగుని గ్రామ ప్రజలెప్పుడూ చూడలేదు. ఎండలో, వానలో, మంచులో ఎళ్లవేళలా పాప గొడుగుతోనే వుండేది. నీలంగొడుగు లేని బినియాను మనం వూహించలేము. ఊరివాళ్లు పాప గొడుగుని ఎంతో మెచ్చుకునేవాళ్లు. వ్యాపారి నందూ కన్ను, నీలంరంగు గొడుగుపై పడుతుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. బినియాకు చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బు ఇలా రకరకాల ఆశలు చూపుతాడు. గొడుగు తనకు అమ్మమంటాడు. పాప అస్సలు ఒప్పుకోదు. వ్యాపారి నందూ ఈర్ష్య పడతాడు. వ్యాపారి నందూ సిటిలో ఒక గొడుగుల దుకాణానికి వెళ్లి రంగుల జపనీస్ గొడుగు గురించి వాకబు చేస్తాడు. దాని వెల 2500 రూపాయలని డబ్బు మొత్తం ముందే కడితే ఒక పది రోజుల్లో ఢిల్లీ నుండి తెప్పిస్తారు అని తెలుస్తుంది. లోభి, పిసినారి ఐన నందూకి అంత డబ్బు పెట్టి గొడుగు కొనడం ఇష్టం లేదు.నందూ నిరాశగా బలో తిరిగి వస్తుంటే, గ్రామసమీపంలో వున్న జలపాతం కింద నీలం గొడుగుతో నిలబడివున్న బినియా కనిపిస్తుంది. నందూ బస్ ని ఆపి అక్కడే దిగి పాప వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. 'బెలూన్ల గుత్తి 50 రూపాయలు ఇస్తాను, నీ గొడుగు నాకు అమ్మేయి' అంటాడు. పాప అందుకు ఒప్పుకోక, అక్కడి నుండి వెళ్లిపోతుంది. కోపంతో నందూ బెలూన్ల గుత్తిని గాలిలో ఒదిలేస్తాడు. తరువాతి రోజు పాప నీలం గొడుగుతో ఒక పాముతో పోరాడి వాళ్ల అన్నయ్యను కాపాడుతుంది.. ఈ విషయం గురించి గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలావుండగా ఒక రోజు పాప కొండపై ఆవులు కాస్తున్నప్పుడు నందూ దుకాణంలో పనిచేసే రాంగోపాల్ అనే పిల్లవాడు నీలం గొడుగుని దొంగిలిస్తాడు. ఈ పని తను యజమాని జీతం పెంచుతానన్నాడని చేస్తాడు. ఈ దొంగతనం గురించి పాపకు కానీ ఊరి ప్రజలకు కానీ తెలియదు. పాప భోరున ఏడుస్తుంది. అన్నం తినదు.ఊర్లో వాళ్లంతా బతిమిలాడతారు. పాపకు నందూ మీద అనుమానం. పోలీస్ అంకుల్ని తీసుకెళ్లి నందూ దుకాణం అంతా వెతుకుతారు కానీ నీలం గొడుగు దొరకదు. తన పరువుని పాప బజారుకీడ్చిందని నందూ కోప్పడతాడు. తను కొత్త రంగుల జపనీస్ గొడుగు కొన్నదాకా పచ్చడి ముట్టనని గ్రామ ప్రజల ముందు శపథం చేస్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఊరి పోస్ట్మ న్ నందూకి ఒక పెద్ద అట్ట పెట్టెను తెచ్చిస్తాడు. నందూ గ్రామ ప్రజల మధ్య ఆ అట్టపెట్టెను తెరుస్తాడు.. మిలమిలా మెరిసిపోయే ఎర్రటి జాపనీస్ గొడుగు. నందూ ఆనందం వర్ణనాతీతం. నందూ అందరి ముందూ గర్వంగా పచ్చడి తింటాడు. ఆ ఎర్రటి గొడుగు వేసుకుని వూరంతా తిరుగుతాడు. పాపను వూరిస్తాడు. పాప ఏడుపు మొహంతో వుంటుంది. నందూ పట్నం వెళ్లటానికి బస్ ఎక్కుతుంటే, ఎర్ర గొడుగు బస్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతుంది. అందరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటకు లాగుతారు.