శ్రీరమణీయం - మొదటి భాగం: బాల్యం , రచనా జీవితానికి అంకురం

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఎపిసోడ్ వివరాలు:మొదటి భాగం : ఆయన బాల్యం , రచనా జీవితానికి అంకురం.రెండవభాగం: కవి సామ్రాట్ విశ్వనాధ వారి గురించి కొన్ని విశేషాలుమూడవ భాగం : బాపురమణ గార్లతో ఆయన సినీ ప్రయాణంనాలుగో భాగం: శ్రీరమణ గారి కథా రచనశ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3*** ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో వారి చక్కటి కథలు రెండిటిని మీకు అందించడం జరిగింది హర్షణీయం ద్వారా.వివరాలు క్రింద మీరు చూడవచ్చు.1.బంగారు మురుగు - శ్రీరమణ గారి రచనhttps://harshaneeyam.in/2020/10/17/bangarumurugu/2.పీవీ తో నేను - వెంకట సత్య స్టాలిన్ - శ్రీరమణ గారి రచన.https://harshaneeyam.in/2020/10/10/stalin/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy