శ్రీరమణ గారి 'మిథునం' - ఫణి డొక్కా గారి స్వరాన!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

కథ పేరు 'మిథునం'. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ.సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు.ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది.ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు ఫణి డొక్కా గారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.ఫణి డొక్కా గారి పరిచయం:వారు, చక్కటి కథా రచయిత, కవి, గాయకుడు, బంగారు నంది అవార్డు & రెమీ ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకుడు. గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తూ, తన వంతు సాహితీ సేద్యం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 250 కు పైగా కథలు, 1000 కు పైగా ఛందోబద్ధమైన పద్యాలు, 500 కు పైగా వచన కవితలు వ్రాసారు."పసిడి పూర్ణమ్మ" కూచి పూడి నృత్య రూపకాన్ని రచించారు. మేనకా విశ్వామిత్ర నృత్యరూపకానికి గాత్ర ధారణ చేసారు. శ్రీ వెంపటి చినసత్యంగారి శిష్యులచే ప్రదర్శింపబడిన "రుక్మిణీ కల్యాణం" కూచిపూడి నృత్య రూపకంలో పలుమార్లు అగ్నిద్యోతనుని పాత్ర, సూత్ర ధారుని పాత్ర ధరించారు. ఫణి గారికి వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, అక్కినేని ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా "సాహితీరత్న" అనే బిరుదు ప్రదానం చేసాయి. భారతీ తీర్థ సంస్థ వారు "సాహితీ కళా భారతి" అనే బిరుదుతో సత్కరించారు. నాటా సంస్థ వారు విశిష్ట సాహితీ పురస్కారం తో సన్మానించారు. ప్రముఖ వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల, కవితల పోటీలలో ఫణి గారు పలుమార్లు ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 'పల్లకీ" (కథా సంపుటి), "టేకిట్ ఈజీ" (హాస్య వ్యంగ్య గల్పికలు) అనే రెండు పుస్తకాలు రచించారు. పల్లకీ పుస్తకాన్ని ఆ దశాబ్దంలో వచ్చిన 10 ఉత్తమమైన పుస్తకాలలో ఒకటిగా ఎంపిక చేసి, రాజా రామమోహన రాయ్ ఫౌండేషన్ వారు ఆ పుస్తకాలను కొనుగోలు చేసి, ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపిణీ చేసారు. కీర్తిశేషులు శ్రీ.పెమ్మరాజు వేణు గోపాలరావు గారి పేరిట మైత్రి సంస్థ అందించే సాహిత్య విభాగపు బంగారు పతకాన్ని ఫణి గారు అందుకున్నారు. తెలుగువన్ రేడియో లో 300 కు పైగా తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఫణి నిర్వహించారు. సుమారు ఐదువందలకు పైగా పాటల కార్యక్రమాలలో పాల్గొని సినీ, లలిత గీతాలు ఆలపించారు. వారాంతాలలో, వీలైనప్పుడల్లా అట్లాంటాలోని పిల్లలకు తెలుగు చదవటం, వ్రాయటం, మాట్లాడటం (అంతర్జాతీయ తెలుగుబడి) నేర్పుతూ ఉంటారు.   This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy