మా స్నేహ రమణీయం!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి. వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స్థానములో వున్న మల్లిగాడికి వీడికి మార్కుల లో తేడా ఓ వంద మార్కులకు పైనే. అప్పటి వరకు మా మల్లిగాడు ఎదురులేని మనిషి అన్న మాట. ఆ మార్కుల తేడా వీడి మనస్సులో చాలా బలం గా నాటుకు పోయినది. నేను ఎనిమిదవ తరగతి లో చేరగానే మొదట నాకు వీడు చెప్పినది ఏమిటంటే వాడికి మూడేళ్ళ సమయం ఉందని, ఈ మూడేళ్ళలో కష్ట పడి చదివి పడవ తరగతిలో ప్రథముడిగా నిలుస్తానని.  దానికి తగ్గట్టే ప్రణాళికలు వేసాడు వీడు, ఎనిమిదిలో నాతో చాలా పోరాడాడు, నన్ను తెలుగు బదులు సంస్కృతము తీసుకోమని, అలా తీసుకుంటే పదవ తరగతి లో మంచిగా మార్కులు సాధించ వచ్చు అని. కాలం జరిగే కొద్ది ఒక మనిషిలో వచ్చే అద్భుతమైన మార్పుని దగ్గర నుండి వీక్షించటం ఒక అదృష్టమైతే నేను అట్టి వాళ్లలో ఒకడిని, ఎందుకంటే వాడి మార్పుకి ప్రత్యక్ష సాక్షిని నేనే. పాఠ్య అంశాల మీద ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయుల వెంటపడి వెంటనే తీర్చుకోవటం, అంశాలమీద వేరు వేరు పుస్తకాలు చదవటం వీధిలో వికాసాన్ని బాగా పెంచాయి. ఆ వికాసము  వలన వీడు మా లిటరసీ అసెంబ్లీకి సెక్రటరీ అయ్యాడు మరియు అద్భుతమైన వక్తగా మారాడు. అందులోను వీడు కథలు చెప్పటంలో నా కన్నా దిట్ట. మీకేమో సురేష్ కృష్ణ రాసిన బాషా స్క్రిప్ట్ (బైబిల్ అఫ్ అల్ మోడరన్ స్క్రిప్ట్స్ అట) యీ మధ్య తెలుసు. కానీ నాకు మన రమణుడు ఎప్పుడో పరిచయం చేసేసాడు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ని. నారపనేని వీరాస్వామి గారు వీళ్ళ తాత గారు. ఆయనది నెల్లూరులో కెల్లా పేరుగాంచిన పండ్ల వ్యాపారము.    నేను నోరు విప్పార్చుకుని వినే వాడిని మా రమణుడు చెప్పే సంగతులు,  ఎలా వాళ్ళ నాన్నగారు లక్షలాది ఆస్తులు వదిలేసుకొని, కుటుంబం నుండి బయటకు వచ్చేసి సింపుల్ గా బతికేస్తున్నారో అని. నెల్లూరిలో  పెద్ద బజార్ నుండి కామాటి వీధికెళ్లే మొదల్లో వాళ్ళకొక పండ్ల కొట్టు ఉండేది, అది నడుపుతూ వాళ్ళ నాన్న గారు వీళ్ళ ముగ్గురు అన్న తమ్ములను చదివించుకునే వారు. ఆయన్ని చూడాలనే కోరిక వెంటనే కలిగేది కూడా నాకు. ఆయన నన్ను చాల ప్రేమగా పలకరించే వారు. మా స్నేహితుల్లో చాల మందికి తెలుసు నేను ఆయన్ని నాయనా అనే పిలుస్తానని. ఇప్పటికీ నెల్లూరు వెళ్తే నేను కలిసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇక పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వీడు పుట్టుకతోనే పెదరాయుడు, ఇంటికి పెద్ద కొడుకు మరియు వాళ్ళ అమ్మగారికి కుమారి అయ్యాడు ఆడపిల్లలు లేక. వీళ్ళ అమ్మ గారు మహా స్ట్రిక్టు . నేను అంత దూరం నుండి వచ్చి వీడి చదువు కాజేస్తున్నానని ఆవిడ నమ్మకం. అది నిజం కూడా. వాళ్ళ ఇంటి కెళ్లిన నాకు వాళ్ళ కాంపౌండ్ వాల్ గేట్ దగ్గరే వాళ్ళ అమ్మగారు, కుమార్ ఇంట్లో లేడురా అని చెప్పేవారు,  ఈలోపలే మావాడు బాల్కనీ లో నుండి చేయి ఊపేవాడు. నేను కూడా సిగ్గులేకుండా మీరు చూడలేదేమో అమ్మా వాడు ఇంట్లోనే వున్నాడు అని చెప్పి దూరిపోయేవాడిని చాలా సమయాల్లో. అప్పుడప్పుడు ఆవిడ అలా చెప్పటంతో కొంచెం అంతర్మధనం చెంది యింటికెళ్లి కాసేపు మాత్రం పుస్తకం పట్టేవాడిని, కానీ మన బుద్ధి షరా మామూలే. మా అమ్మ ఎప్పుడు చెప్పినట్టు దాలిగుంటలో వెచ్చగా ఉన్నంత సేపే నంట కుక్కపిల్ల రేపటి నుండి ఎవరి ఇళ్లలోనూ కుండలు ముట్టకూడదు అని అనుకొనేది బయటకు రాగానే దాని బుద్ధి షరా మామూలేనట. ఎనిమిదవ తరగతిలో సైన్స్ ఫెయిర్ కి మల్లి, ప్రతాప్ వెళ్లారు స్కూల్ తరపున కావలికి. మేము ఇద్దరం టికెట్ పెట్టుకొని వెళ్లి చూసొచ్చాము. చూస్తూ ఉండరా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్కూల్ తరపున వెళ్తాన్రా అన్నాడు,  అన్నమాట ప్రకారం  తదుపరి సంవత్సరం  గూడూరు లో జరిగిన సైన్స్ ఫెయిర్ కి  వెళ్ళాడు. కల కనటం సాధించు