ఓ అన్నార్థి గోల!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా""ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ""ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో""నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు""అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను""సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ""రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా అన్న దార్లో పది దొంగలొచ్చినా కొట్టేస్తాడురా""సరే రా గిరిబావ, మా అన్న, మీ అన్న కొట్టిన వాళ్ళ కంటే +1 రా"ఇలా మా గిరి గాడు ఎన్నైనా చెప్పనీ, దానికంటే మనం దానికి ఓ +1 కలపటం. ఇక వాడికి చిరాకు పుట్టి, నువ్వు మీ అన్న, మనూరి వాగులో దూకి ఛావండిరా అనే దాకా వెళ్ళేది మా అన్నల గురుంచి మా బాకాలు. గిరిగాడు నాకు వరసకి బావ, ఒకటో క్లాసు నించి మేమిద్దరం ఒకటే బెంచీ. అలా ఇంకో రోజు, మా గిరి బావ గాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు, నా మా చెడ్డ సరదా వేసేసింది వాడి ఏడుపు చూసి, "ఏరా గిరి బావా! మళ్ళీ నాలుగు పీకినాడా మీ అన్నా""దొంగ ఎదవ రా మా అన్న, మా అన్న, వాళ్ళ స్నేహితులతో ఆడుతుంటే, నన్ను కూడా ఆడించుకోమంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను ఆడకూడదని చెప్పి తరిమేసాడురా""అదేందిరా గిరిబావ! నే వెళ్లి మా అన్న వాళ్ళ జట్టుతో చేరతా నుండు, మా అన్న నన్ను చేర్చుకుంటాడు చూడరా""వద్దురా కిరణు, మీ అన్నే రా మా అన్నకి ఎక్క జెప్పింది, నా గురుంచి, వాళ్లిద్దరూ తోడు దొంగలురా, వెళ్ళొద్దురా" అని మా గిరి బావ చెప్పి నా వినకుండా మా అన్న చేత నాలుగు తన్నిచ్చుకొని వచ్చా. "మీ అన్నే నయం రా గిరిబావ, మా వాడు , నేను వాళ్ళు ఆడే వీధిలోక్కూడా రాకూడదు అంటూ నాలుగు తగిలించాడురా!""మా యన్న ఎదవ రా గిరిబావా""మా యన్న ఎదవన్నర ఎధవరా, కిరణు""మా యన్న మీ అన్నకంటే ఎదవ ల్లో ఎదవ + 1 రా గిరి బావా! అవడానికి ఓ సంవత్సరమో లేక రెండేళ్లో పెద్ద అయిన దానికి ఈ అన్నలకి తమ్ముళ్ల మీద ఇంత జులుము చేసే అధికారం ఎవరిచ్చారో, మాకెప్పుడూ అర్థం అయ్యేది కాదు. అసలు నేను మా గిరిబావ, ఇంకా ఎధవన్న ఎదవ అన్న - లున్న తమ్ముళ్ళంతా ఒక అన్న బాధిత సంఘం పెడదామని ఆలోచన కూడా చేసేసాము. దానికి తోడు! ఎక్కడకి బోయినా, వీడు ఆ ప్రవీణ్ గాడి తమ్ముడు రా అన్న బిరుదు నాకు. దానికి అబ్బా ప్రవీణ్ తెల్ల గా బుర్రగా ఉంటాడు, వీడేందిరా కర్రి మోహమేసుకోని. ఇది గాక ప్రవీణ్ గాడి తెలివి వీడికేడుందిరా అనే పోలిక మళ్ళీ. ఏడో క్లాస్ లో అనుకుంటా మా అన్న, ఆయన పుస్తకాల మీద, "ప్రవీణ్ కుమార్, బి.టెక్, ఎం.టెక్" అని రాసేసుకోవటం మొదలు పెట్టాడు. "మరి నువ్వే మవుతావురా , కిరణ్ గా అంటే, నేను పెద్దయ్యి, ఉషా ని పెళ్లి చేసుకుంటా" అనే వాడిని. అది సరేరా పెద్దయ్యాక ఉద్యోగమంటూ చేయాలి గా, దానికేమి చేస్తావురా అంటే, "నేను మన సూలం లాగా బస్సు తోలతాను" అనే వాడిని. అలా మా అన్న ఫస్ట్ గ్రేడ్ సిటిజెన్ అయితే నా దంతా సెకండ్ గ్రేడ్ సిటిజెన్ యవ్వారం. వీళ్లందరి మధ్య, మా శేష మామే నయం, మీరందరు ఎన్నైనా చెప్పండి, చిన్నోడు రంగు తక్కువయినా వాడి మొహం లో కళ, ఆ పెద్దోడికి ఎక్కడొస్తుంది అనే వాడు.ఏడో క్లాస్ లోనే మా అన్న సైకిల్ అర పెడల్ తొక్కటం మొదలెట్టాడు. సీట్ ఎక్కి తొక్కలేదు, పొట్టోడు కదా. ఓ రోజు, "రారా! రామ లింగాపురం దాకా వెళ్లొద్దాము" అన్నాడు పెద్ద పోటుగాడిలా! "ఛా, వీడితో ఏందీ నేను వెళ్ళేది” అనుకుంటానే, మళ్ళీ రామ లింగా పురం అంటే పెద్ద వుర వుర  నాకు, అందుకే సరే అన్నా. వెనక సీట్ మీద ఎగిరి ఎక్కాలి, నేను ఎక్కలేను, నేను అంత కన్నా పొట్టి కదా. మా ఇద్దరి అవస్థలు చూసి మా ఊరోళ్లు, నన్ను వెనక కారేజీ మీద ఎక్కిచ్చి, మా అన్న సైకిల్ కంట్రోల్ అయ్యేదాకా నెట్టి పంపారు మమ్మల్ని. వాళ్ళకీ డౌట్ రాలా, మాకు రాలా మా సామర్ధ్యం మీద, మధ్యలో ఆగితే ఎలా అని. కొంత దూరం పోగానే దారి కాస్త ఎగుడు. మా అన్నకి తొక్క లేక ఆయాసం, దిగరా అని ఒక్క కసురు కసిరాడు. నేను దూకేశా. ఎగుడు అంతా నడిచాము, రామలింగా పురం వరకు అలాగే ఎగుడు ఉండినా బాగుండు, నడుచుకుంటా వెళ్లే వాళ్ళము. దారి మామూలు కాగానే మావాడు తొక్కటం మొదలెట్టాడు, నేను కారేజీ  మీద కు ఎగరటం మొదలెట్టా. నేను ఎగరడం , మా వాడు బాలన్స్...