'ద్రణేవుడు' పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు.ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన ఆయన తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.ఈ పుస్తకం కొనడానికి , లింక్ పై క్లిక్ చెయ్యండి - http://bit.ly/3qJcYCzద్రణేవుడు:సమాచార విస్పోటం అనీ, పోటీ అనీ అనేక నామధేయాలతో ఆధునిక యుగం,  విషయ పరిజ్ఞానం ప్రధాన లక్షణంగా శోభిల్లుతున్నది. ఎవడికి ఎక్కువ వివరాలు తెలుసునో జ్ఞాని కింద లెక్క. రకరకాల టెస్టులు, క్విజ్జులూ,, కెబిసిలు ఇవన్నీ యువతరం సమాచార సేకరణ సామర్ధ్యాన్ని గురించే. నాలుగు పేపర్లు తిరగేసినవాడు సాయంకాలం నలుగురి ముందు నాలుగు విషయాలు ఉగ్గడిస్తే వాణ్ణి జ్ఞాని అనేస్తారు. మనసును అత్యవసర పరిజ్ఞానంతో కాక, అత్యవసర విషయ పరిజ్ఞానంతో కూడా నింపడం, అట్లా కొందరి కంటే కొన్ని ఎక్కువ విషయాలు తెలిసి జ్ఞాపకముంచుకున్న వాణ్ణి బిరుదులతో గౌరవించడం జరుగుతున్నది. వాడెవడో అంత బతుకూ బతికి ఇంగువంటే ఏమిటో తెలుసుకోకుండా, తెలుసుకునే అవకాశం లేకుండగానే దాటిపోయాడు.ఇక ఈ మనిషి మరో విచిత్రం . రైల్లో తారసపడ్డాడు. “నిన్నేనయ్యా అడుగుతున్నది?” అన్నాడాయన రెండోసారి పెద్దగా.అంతకుముందు వేరొక రైలు దడదడ మని శబ్దం చేస్తూ వెళ్తుంటే ఈయన అన్నదేమీ నాకు వినిపించలేదు.ఇప్పుడు “ఏమిటి?” అని అడిగాను.ఆయనకు అరవై ఏళ్లు దాటే వుంటాయి. జుట్టు బాగా తెల్లబడి చెంపలు పెరిగి వున్నాయి.“చూడు! నువ్వు చాలా చదివి వుంటావు కదా. ద్రణేవుడు అనే పేరు, పాత్ర ఎక్కడైనా తగిలిందా? పురాణాల్లో కాని కథల్లో కాని... ఎక్కడైనా....”నేను లేదంటూ తల అడ్డంగా వూపాను. “అలాగా?” అన్నాడాయన నిరాశగా.తర్వాత తన ఎదురుగా కిటికీ పక్కన కూర్చుని ఏదో చదువుకుంటున్న నడివయస్సు వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగి అతడు లేదనగానే హతాశుడై నిట్టూర్చి నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.రైలెక్కినప్పుటినుంచి చూస్తున్నాను.... ఈ మనిషి వాలకం చిత్రంగా వుంది. ఒక పొడుగాటి లావాటి పుస్తకం వొళ్లో పెట్టుకుని వుండి వుండి అందులో ఏదో రాస్తున్నాడు. రైలు ఆగిన ప్రతి స్టేషను పేరు ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ వరసగా రాసి పెట్టుకుంటున్నాడు. కాసేపాగి మళ్లీ  -"అంతా బాగానే వుంది. ఈ ద్రణేవుడెవరో ఎక్కడివాడో వివరాలేమాత్రం తెలిసి చావడం లేదు. ఎందరినో అడిగాను. ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వివరం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో...." అన్నాడు.“ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదులెండి. ఎవరో ఒకరు చెప్పకపోరు” అన్నాను ఏమీ తోచనివాడిలా.“పదేళ్ల నుంచి తెలియని విషయం ఎప్పుడు తెలుస్తుందో... అసలు తెలియనే తెలియదో"అంటూ నిట్టూర్చాడు.నేను చాలా సేపటి నుంచి మధనపడుతున్నాను. 'ఈ మనిషి ఎవరా?” అని.  మనసు లోపలి పొరలలో ఎక్కడో ఒక మూల ఈ వ్యక్తి వివరాలు భద్రంగానే వున్నాయి. అయితే స్పష్టంగా ఉపరితలానికి రావడంలేదు. -“ఇలా రైల్వేస్టేషన్ల పేర్లూ ఇంకా ఏవేవో విషయాలు రాస్తున్నారు కదా ఈ పుస్తకంలో.... ఎందుకీ వివరాలన్నీ?” అని అడిగాను. -ఆయన కళ్లలో మెరుపు. “ఎందుకేమిటి? ఇదంతా నాలెడ్జి... ఇన్ఫర్మేషన్... ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా. మన తాత ముత్తాతలు 'తమకెందుకులెమ్మ'ని ఊరుకుని వుంటే మనకివ్వాళ ఇంత ఇన్ఫర్మేషన్ దొరికేదా? ఇన్ని విషయాలు తెలిసేవా? సమాచారం, విషయపరిజ్ఞానం వుంటేనే మనిషి మనిషవుతాడు. లేకపోతే మా ఫ్రెండులాగా అతి చిన్న విషయం కూడా తెలియకుండా చచ్చిపోతాడు. పదేళ్ల కిందట మావాడొకడు ఇంగువ అంటే ఏమిటో తెలియకుండానే చచ్చిపోయాడు. అప్పటినుంచి నేను ఇట్లా విసుగనేది లేకుండా విషయ సేకరణ చేస్తున్నాను. అదీ యిదీ అని ఏమీ లేదు. చూసినదీ విన్నదీ అంతా. రికార్డు చేసి పెట్టడమే”ఇప్పుడు నా మనసులో మెరుపు మెరిసినట్టయింది. చాలా ఏళ్ల క్రిందట సంగతి... మాఇంటి పక్కన నడివయసు దాటిన ఒక వ్యక్తి గుండెజబ్బుతో బాధపడి రెండు మూడు రోజులు అపస్మారక స్థితిలో వుండి చివరకు పోయాడు. అప్పుడీయన అక్కడికి వచ్చాడు.మనిషి పోగానే హతాశుడై వెనువెంటనే తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే పోలికలు బయటపడటం మొదలై ఆ వ్యక్తి ఇతడే అని నిర్ధారించుకున్నాను. ఇప్పుడు...