రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. 'చలిచీమల కవాతు' కొనడానికి - https://amzn.to/3kXhuhK'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - మీరు ఎంత కాలం నించీ కథలు రాస్తున్నారు? రచనకు మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?80లలో ఒకటి రెండు రాశాను. నాకవి అంతగా నచ్చలేదు. మళ్లీ అరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టాను. అంటే గత అయిదారేళ్లుగా రాస్తున్నాను. చిన్నప్పటినుండి సాహిత్యంలో ఆసక్తి ఉంది గానీ రాయాలనే ఆలోచన కొత్తగా వచ్చింది. కొన్ని కథలు ప్రచురింపబడ్డాక, పాఠకుల స్పందనలు తెలిశాక కొన్ని రకాల కథలు నేను రాయగలను అనే ధైర్యం, నమ్మకం కలిగాయి.మీరు హిస్టరీమీద పట్టు ఎలా సాధించడానికి మీ చిన్నతనంలో దోహదం చేసిన కారణాలేవైనా ఉన్నాయా? పట్టు సాధించాను అని చెప్పుకోలేను గానీ, చిన్నతనం నుండీ చరిత్ర అంటే ఆసక్తి ఉండేది. అది కూడా ప్రధానంగా పుస్తక పఠనం ద్వారా ఏర్పడ్డదే. పుస్తకాలు కొత్త ప్రపంచాల్ని మన ముందుంచుతాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే చిన్న ఊళ్లోని ప్రభుత్వ లైబ్రెరీలో – ‘మొగలాయి దర్బారు కుట్రలు’, నార్వీజియన్ చరిత్రకారుడు రాసిన ‘కడలి మీద కోన్-టికి, రాహుల్ సాంకృతాయన్ రచనలు – ఇటువంటివన్నీ చదివాను. అవన్నీ అనువాదాలే. మా నాన్నగారు విల్ డ్యురాంట్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్’లాంటి ఇంగ్లీషు పుస్తకాలను చదువుతూ ఆ వివరాలు మాకు చెప్పేవారు. ఆవిధంగా సాహిత్యంతో బాటుగా చరిత్ర పట్లకూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.స్కూలు రోజుల తరువాత ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా, డీ డీ కోసంబి, ఈ. ఎచ్. కార్, రొమిల్లా థాపర్ ల ప్రభావం నాపైన పడింది. ‘చరిత్ర అంటే గతానికీ, వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ’ అంటాడు ఈ. ఎచ్. కార్. అందుకే చరిత్రని విడిగా కాకుండా, వర్తమానంతోనూ, తద్వారా భవిష్యత్తుతోనూ సంధించగలిగే సందర్భాలు నాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి.మీ రచనల్లో హిస్టారికల్ ఫిక్షన్ ముఖ్య ప్రక్రియగా ఎంచుకోడానికి కారణాలు ఏమిటి? మీరు మెరైన్ ఇంజనీర్ కావడం అందుకు తోడ్పడిందా?ఒక సమాజంలో అంతవరకూ లేనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినపుడు ఏమవుతుంది? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఒక ఇంజినీరుగా నాకు ఆసక్తి కలిగించే ప్రశ్నలు ఇవి. ‘వార్తాహరులు’, ‘మూడు కోణాలు’ కథల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మెరైన్ ఇంజనీర్ ని కావడం మూలాన నాకు వాణిజ్య నౌకారంగ చరిత్ర, అంటే మేరిటైం హిస్టరీలో ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ముఖ్యంగా యూరోపియన్ నావికులు, వ్యాపారులు మనదేశంలో అడుగుపెట్టిన తొలిదశలో వచ్చిన మార్పుల్ని శోధించడం నాకు ఇష్టమైన పని. ఒక స్తభ్దతకు లోనై, ఎన్నో శతాబ్దాలపాటు నిద్రాణంగా ఉన్న మన ఫ్యూడల్ వ్యవస్థలో యూరోపియన్ల రాకతో కదలికలు మొదలయ్యాయి. 'ఆసియా ఖండం తన చరిత్రలో తానే మునిగి, సుదీర్ఘమైన నిద్రావస్థలో ఉంది’ అన్నాడు మార్క్సు. ఆనాడు మొదలైన మార్పులు మన దేశపు ఆధునిక చరిత్రలో చాలా కీలకమైనవి.యారాడ కొండ నవల రాసినప్పుడు ఇంతకు మునుపు విశాఖ పట్టణం ఎలా ఉండేదో తెలుసుకోడానికి మీరు చేసిన పరిశ్రమ గురించి వివరాలు చెప్తారా?ఇంట్లో వాళ్లు తాత ముత్తాతల కథలు చెప్తూనే ఉండేవారు. మిగతావి ఎక్కువగా నేను చూసినవి, నాకు తెలిసిన సంగతులే. కొన్ని వాస్తవాలను, వివరాలను, తేదీలను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అవి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. కొంత మంది మిత్రులు, పెద్దలు సహకరించారు.విశాఖ వాసుల నించీ...