'కే ఎన్ వై పతంజలి' గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

తెలుగు సాహిత్యం లోని గొప్ప రచయితలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా, హర్షణీయం సుప్రసిద్ధ పాత్రికేయులు , రచయిత, కవి, అనువాదకులు శ్రీ మందలపర్తి కిషోర్ గారిని, శ్రీ కే ఎన్ వై పతంజలిగారి గారి కథా రచనలపై తన అభిప్రాయాలను , 'మోటు మనిషి ', 'తోటి వేటగాళ్లు ', 'సీతమ్మ లోగిలి ' కథలపై విశ్లేషణలను, హర్షణీయం పాఠకులకు ప్రత్యేకంగా అందించమని కోరడం జరిగింది. కిషోర్ గారు వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి, ఆడియో రూపం లోనూ మనకు ఈ విశ్లేషణను ఆయన అందించడం జరిగింది. అత్యంత ఆసక్తికరంగా , పతంజలి గారి రచనల గురించి అనేక చక్కటి విషయాలను వివరిస్తూ , కిశోర్ గారు ప్రసంగించారు. వారికి హర్షణీయం హృదయ పూర్వక కృతజ్ఞతలు.కిషోర్ గారు గత మూడున్నర దశాబ్దాలనించి తెలుగు లోనూ ఇంగ్లీష్ లోనూ కవిత్వం రాస్తున్నారు. పుస్తక అనువాదాలు చేస్తున్నారు. పత్రిక రంగంలో విశేష కృషి చేశారు. సిఫీ, ఇండియా టుడే-తెలుగు పత్రికల సంపాదకునిగా వ్యవహరించారు. 'కన్యాశుల్కం పలుకుబడి' (గురజాడ పదకోశం - 1), పడమటి కిటికీ (పాశ్చాత్య సాహిత్య పరిచయం) , పెరటి చెట్టు (వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర పరిచయం) అనే పుస్తకాలు ప్రచురించారు. 'అనువాదం - కవిత్వానువాదం' అనే పుస్తకాన్ని ప్రచురింపబోతున్నారు. https://harshaneeyam.in/2020/10/29/patanjali-garu/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy