అతిథి దేవోభవ!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ "ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి సిరి.కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నార్ లో ఓ చిన్న 'టీ ఎస్టేట్' కొని దాని భాద్యత అన్నయ్య ఇచ్చాడు.టూరిజంలో భాగంగా పర్యాటకులకు మా ఇంటి భోజనం పెట్టే లైసెన్స్ ఉండి ఎన్నో అవార్డ్లు తెచ్చిపెట్టాయి. ఆ విషయాలు అమ్మ వదిన చూస్తారు.ఓణం పండుగ, బోట్ రేసులు, టూరిస్టులు మా ఇంట్లో భోజనం చేయడం ఎంతో మధురమైన క్షణాలు.ఎంబిఎ చేసిన నేను, అందరికీ సాయంగా ఉంటూ ఏదైనా స్టార్టప్ స్ధాపించాలని కల.ఓ రోజు మా భోజన మీటింగ్ లో నాన్న నా గురించి అడగడం, నా ఆలోచనలు చెబితే సరేననడంతో కాస్త కుదుటపడ్డా.. నాకైతే ఇక రంగంలో దిగాల్సిన టైమ్ వచ్చిందనిపించింది.రెండు బెడ్ రూమ్స్ ఉండే హౌస్ బోట్ ప్రాజెక్ట్ అనుకున్నాను. ఇంట్లో ఓకే అనడంతో పని మొదలుపెట్టాను.నేను లంచం ఇవ్వకపోవడంతో పర్యాటక విభాగంలో నా ప్రాజెక్ట్ ఫైల్ బ్యాంక్ లోన్ కోసం ఆమోదం ఆలస్యం అయితే విజిలెన్స్ కమిషనర్‌కు నేను రాసిన లేఖ పని చేసి పెట్టింది. బోటును షూరిటీగా పెట్టి లోన్ తీసుకునే స్కీంతో కొత్త బోటు తీసుకున్నాను.అలెప్పిలో నా ఆరు నెలల టూరిజం ట్రైనింగ్ అయ్యాక నాన్న అన్న మాటలు " నీ ప్రొఫెషన్ లో నమ్మకమే పెట్టుబడి. అది నిలబెట్టాలి అంటే లాభ నష్టాలు ఒక్కో క్షణాన మర్చిపోవాలి అని "హౌస్ బోట్ నీళ్ళ మీద రిసార్ట్ లాంటిది, సదుపాయాల కొదవే లేదు. ఏసి బెడ్రూంలు, హాల్, కిచన్, పై ఫ్లోర్ లో డైనింగ్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. 24గంటల పాటు వాళ్ళే యజమానులు.నా బోట్లో ముగ్జురు ఉద్యోగులు. ఒక కుక్, బోట్ కీపర్, బోట్ క్యాప్టెన్. ఒక్కరోజు ప్యాకేజీలో లంచ్, డిన్నర్, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటాయి. ప్రతిరోజూ ట్రిప్ వివరాలు ముందే మాకు అందుతాయి.వెంబనాడ్ సరస్సు కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది మా జీవనోపాధి. పర్యాటక రంగానికి ఆయువుపట్టు. వరి, చేపల ద్వారా జీవనోపాధిని అందిస్తుంది. నది ఒడ్డున ఉన్నవారికి ప్రధాన రవాణా సొంత బోట్లే.ఇక ముందు రోజు వేసిన టెండర్లు తెల్లారే తెరిచే ప్రోగ్రాం ఉండడంతో బోట్లన్నీ ఆపేశారు. నాకు చాలా ముఖ్యమైన రోజది. చుట్టూతా చాలా హడావిడి. దాదాపు అయిదొందల బోట్ల కొత్త పర్మిట్ కావడంతో కాస్త రాజకీయ వేడి కూడా తగులుతోంది. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.టూరిజం అధికారులు, లేక్ పోలీస్ బృందాలు కలిసీ పడవ నాణ్యత, ఫిట్ నెస్, సౌకర్యాల తనిఖీలు చేస్తున్నారు.టెండర్లు కొందరికి దక్కితే కొంతమందికి రాలేదు. నా బోటు ఓకే చేసి పర్మిట్ ఇచ్చారు. ఇక రెండేళ్లు భయం లేదు. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేశా, రాత్రి బోట్లో ఉంటా అని.. ఎందుకో బోట్లో సరస్సంతా తిరగాలనిపించింది.టెండర్ రాని వాళ్లలో ఎవరో ఎమ్మెల్యే, నా పర్మిట్ ఇవ్వాలని బలవంతంగా బెదిరించేలా వేడుకున్నా నేనివ్వలేదు. నేను కొత్త కదా అని నన్నడిగాడేమో!!కలెక్టర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు.ఆ రోజు బోట్ మొత్తం ఇద్దరి పేర్ల మీద ఉంది. వీళ్ళిద్దరి కోసం చూస్తుంటే వాళ్లకు తోడుగా వచ్చిన ఓ ముగ్గురు సెండాఫ్ ఇస్తే బోటు మాతో, వాళ్ళిద్దరితో కలిపి బయలుదేరింది.వెల్ కమ్ డ్రింక్ సర్వ్ చేసి వాళ్ళను పరిచయం చేసుకుని టూర్ గైడ్ అయిపోయా.వినయ్, అంజలి కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ ట్రిప్ అది. కేరళ కాస్త తిరిగి రేపు రాత్రి కొచ్చిన్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. కేరళలో మా హౌస్ బోట్ వారి చివరి మజిలీ..ఈ మద్య కాలంలో మా అతిథులతో ప్రయాణించింది చాలా అరుదు. ఒడ్డున నిలబడి సెండాఫ్ ఇవ్వడం, వచ్చాక రిసీవ్ చేయడమే నా పనిగా ఉండేది. కొత్త జంట కావడంతో నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నా..మాతో పాటు వెంబనాడ్ అలలపై తేలుతున్న ఓ రెండొందల బోట్లని చూసి వారు మైమరచిపోయారు. అటూ ఇటూ కనపడే వరి పైరు, పక్కనే ఇళ్ళు, సరస్సులో చేపలు, వాటి కోసమొచ్చే కొంగలు, అవన్నీ చూడ్డానికే అన్నట్టు బరువుగా ముందుకెళుతున్న మా బోటు, ఒక్కో కవికి ఒక్కో ఊహకందని వర్ణనాచిత్రం. మధ్యాన్న భోజనంలో ప్రపంచం మెచ్చే "కేరళ సద్య" లో అన్ని రకాల వంటలను ఆస్వాదిస్తూ తృప్తిగా భోంచేశారు. సాయంత్రానికి మా బోటు ఒడ్డు చేరింది.బోట్ ఆసిస్టెంటుకు కావలసినవి చెప్పి ఊళ్ళోకి పంపితే అరగంటలో అన్నీ తెచ్చేసి బోటు కిచన్లో ముగ్గురూ బిజీ అయ్యారు.రాత్రి...