పిల్లల్ని కనాలంటే?

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను...