బెల్లంకొండ వెంకటేశ్వర్లు!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాముఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి.పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. వూరు మాత్రం మా వూరే, ఉప్పలపాడు.వారం లోపులే సావాసం గాడు అయ్యాడు, వాడి కి తెలియని విద్యే లేదు. వాడి పుస్తకాల సంచి మాకో వింత ప్రపంచం. దాన్లో ఓ కేటర్బాల్ (స్లింగ్ షాట్) దార్లో కనపడ్డ చింత కాయలో లేక సీమ చింత కాయలో కొట్టడానికి, రాలిన తాటి పళ్ళు కాల్చడానికి ఓ అగ్గిపెట్టె, దారి మధ్యలో ఆగి ఆడడాని కో అరడజను గోళీలు, యూనో లాగ ఆడదానికి సిగరెట్ బాక్స్ కార్డ్స్.ఇవన్నీ కాక వాడి కి అమోఘమైన మిమిక్రి కళ వుంది. వచ్చిన వారం పది రోజుల్లోనే అందరి అయ్యవార్లను అనుకరించడం నేర్చేసాడు. వాడే మాకు సెంటర్ అఫ్ అట్రాక్షన్. ఇంత టాలెంట్ సొంతమైన మా వాడిని అన్యాయంగా పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు అని తేల్చేశారు మా అయ్యోర్లు. మాకు మా అయ్యోర్ల అభిప్రాయం తో అస్సలకి పనిలేదు కదా, మా హీరో వాడే.నేను వాడు ఓ ఒప్పందానికి వచ్చేసాము. పరీక్షల్లో వాడూ నేను పక్క పక్కన లేక పోతే నా వెనక వాడో కూర్చోవాలని. నాకు వచ్చినవన్నీ వాడు చూసి రాసేసుకోవాలి, వాడికి వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించేయాలి. ఆరోతరగతి యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ మరియు హాఫ్ యియర్లీ అన్నీ మేనేజ్ చేసేసాము.క్లాస్కెళ్ళింతర్వాత అంతా షరా మామూలే. ఒక్కో అయ్యోరు రావటం వాడినేదో ప్రశ్నలడగటం, వీడేమో వాళ్ళు అడక్క ముందే బెంచీ ఎక్కటం. వాళ్లేమో తా జెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అంట అంటూ ఇంకా చీవాట్లు పెట్టటం.రోజులు గడుస్తూనే వున్నాయి, మా అయ్యోర్లలో మార్పేమీ లేదు. మేము మాత్రం బుద్ధిగా వుండే పిలకాయల్ని కూడా కోతులుగా మార్చేస్తున్నాము. మా అయ్యోర్లేమో మళ్ళీ యూనిట్ పరీక్షలు వస్తున్నాయి, బాగా చదవండి అంటూ, అవేవో పబ్లిక్ పరీక్షలు అయినట్టు హెచ్చరికలు జారీ చేయటం మొదలు పెట్టారు. బెల్లంకొండోడి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఏమీ చదవని వీడికి వీడికి ఇప్పటి వరకూ వచ్చిన మార్కులకి బాలన్స్ కుదరటం లేదు అంటూ, మొదటి సారిగా నన్నో మూల, వాడినో మూలా కుర్చోపెడతామని ముందే వార్నింగ్ ఇచ్చారు.అయినా మా వాడి మొహం లో టెన్షన్ కనపడలా, దానిక్కూడా వాడి దగ్గరేదో సొల్యూషన్ ఉన్నట్టు. ఓ రోజు ఉన్నట్టుండి, యురేకా అనుకుంటూ వచ్చాడు నా దగ్గరకి."నాకు నువ్వు అన్నీ ప్రశ్నలకి జవాబులు రాసివ్వు ముందరే" అన్నాడు."చిట్టాలు పెడతావా. ఎక్కడ దాచుకొని పోతావురా వాటిల్ని, జోబీలోనా, లేక నీ తలకాయ జుట్టులోనా" అని నవ్వా నేను."కాదురా! మనవేమో నేల బల్లలు, ఫ్లోరింగ్ అంతా మట్టి. ముందే వెళ్లి నేను నా ప్లేస్ లో చిన్న గుంత లోడి, నువ్విచ్చే పేపర్స్ అన్నీ అక్కడే కప్పెడతా" అన్నాడు పెద్ద హీరో లాగా."దొర్కవుగా" అన్న."లేదేహే! నువ్వొట్టి పిరిగ్గొడ్డు వి"నిజమే మా బెల్లంకొండోడి ఐడియా నే ఐడియా. విజయవంతం గా రాసేసాడు తెలుగు, ఇంగ్లీష్.కానీ మూడో రోజు లెక్కల పరీక్షలో పట్టుబట్టాడు వాడు మరీ ఓవర్ గా సంభాషణలతో పాటు నడకని కూడా మిమిక్రి చేసే మా సోషల్ అయ్యవారికి.మరు నిమిషం వాడి వీపు మరియు నా వీపు బద్దలయ్యాయి. చిట్టాలు పెట్టింది వాడే, కానీ రాత నాది కదా. ప్రతీ అయ్యోరు రావటం, తీయండి రా గుంజీలు అనటం, తీసి తీసి మేము పడిపోయేదాకా తీయించటం. కాస్త ఓపిక రాగేనే ఇంకో అయ్యోరు తగులుకోవటం.మా ఘన కార్యం తెలిసిన మా హెడ్ మాస్టర్ బహు ముచ్చట పడి వీళ్ళ సమయం మధ్యాహ్నం నుండి నాకు బహూకరించండి అని మా అయ్యోర్లను వేడుకొని, ఆయన రూమ్ ముందర ఆయనకు కనపడేలా మోకాళ్ళ దండన కార్యక్రమం మొదలెట్టారు. ఇదే మేలురా హర్షా అయ్యోర్ల బెత్తం దెబ్బలు , గుంజీళ్లు కంటే , ప్రాణం హాయిగా ఉందబ్బా అంటూ పళ్ళికిలిచ్చాడు వాడు.ఆ రోజు నేనైతే ఇల్లెలా చేరానో నాకే తెలియదు, ఆ రోజే కాదు ఒక వారమంతా కదిలితే వొళ్ళంతా ఒకటే సలుపు, గుంజీళ్ల మహిమ.అలా జరిగిపోయేదేమో కాలమంతా, ఆ రోజు ఆ అవ్వ మా అమ్మ కాళ్ళ బడకుండా వుండి ఉంటే.మా ఊరి పొలాలకు పోవాలన్నా, పొలాలనుండి ఇళ్ల కు పోవాలన్నా అందరు మా వీధి గుండా, మా ఇంటి ముందర నుండే వెళ్ళాలి.ఓ రోజు సాయంకాలం, ఓ ముసలవ్వ, వొంట్లో శక్తీ అంతా వొడిగి పోయినట్లుగా పొలం నుండి ఇంటికి వెళ్తూ కనిపించింది మా అమ్మకి."నర్సమ్మ బాగుండావా!" అంది అమ్మ."ఏమి బాగు సుజాతమ్మ, ఎదో ఇలాగా" అంటూ ఆగింది అవ్వ, బుట్టని ఇంకో సంకలోకి మార్చుకుంటూ."మనవడు ఎలా వున్నాడు నర్సమ్మ""బాగానే వున్నాడమ్మా! మొన్నటి దాకా బుచ్చిలో చదువుకొనే వాడు,...