లీలా కాలనీ

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది..డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ. "మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ? "బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ?తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల్ చూసుకో" అని. సమాధానం గూడ చెప్పకుండా తాళాలు తీస్కొని పరిగెత్తాడు రావకృష్ణ.వెనకనించి అరిచాను , "జాగర్త బండి మనది కూడా కాదు" .ఆకాశం చూస్తే నల్ల మబ్బులతో ముసురుకోని వుంది. రామకృష్ణ తొందర చూస్తుంటే, మనిషికో, బండికో షేపులు మారడం ఖాయం అనిపిస్తోంది ఈ రోజు. తలుపేసి వొచ్చి మళ్ళీ తల వాల్చా.నేను రామకృష్ణా, ఎచ్ ఎం టీ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాం తొమ్మిది నెల్ల క్రితం.ఒక మెషీన్ కమిషనింగ్ కి అని చెప్పి , మేము వైజాగ్ కి వచ్చి నెల అయ్యింది. మా బస ఊరవతల, వర్క్ సైట్ కి దగ్గర్లో. ఫ్యాక్టరీ గెస్టుహౌస్ అనబడే రెండంతస్తుల ఇంట్లో. రోజూ, మమ్మల్ని ఫ్యాక్టరీ కి తీసుకెళ్లే కార్ డ్రైవర్ నరసింహం దగ్గర్లోనే ఉండేవాడు. తను చెప్పాడు, " సాయంత్రం ఆరు దాటితే , సిటీ బస్సు గూడా దొరకదు సిటీ నుంచి రావడానికి" , అని చెప్పి.ఇంటికంతా మేమిద్దరమే, ఫస్ట్ ఫ్లోర్ లో వుండే పక్క పక్క రూముల్లో . ఇంకెవరూ లేరు. వున్న వంటతను గూడా ఎదో ఒంట్లో బాగాలేదని వూరెళ్ళిపొయ్యాడు, మేమొచ్చిన రెండు రోజుల్లోనే. కాఫీ తాగాలన్నా రెండు కిలోమీటర్లు పోవాల్సిందే గెస్ట్ హౌస్ నించి.నేను రామకృష్ణ నాలుగేళ్లు ఒకే కాలేజీలో చదూకున్నాం హైద్రాబాద్లో. అప్పటికే సకల కళాపోషకుడు. నాకు తెల్సి గ్రాడ్యుయేషన్ అయ్యేలోపల మా కాలేజీలో, రామకృష్ణని ఆరుగురు గాళ్ ఫ్రెండ్స్ మార్చేసుకున్నారు. అప్పట్లో అతనితో పెద్ద పరిచయం లేదు నాకు. అతనికంత టైమూ వుండేది కాదు. ఈ వూర్లో గూడా, రామకృష్ణ ఉధృతి తగ్గట్లేదు.ఫ్యాక్టరీ నించి రాంగానే, బండేసుకొని వెళ్లపోతాడు , సాయంకాలం ఈ టైం కి . మళ్ళీ వచ్చేది రాత్రి బాగా పొద్దు పోయింతర్వాత. అతని ఎనెర్జీ లెవెల్సు విపరీతం. ఇంత తొందరగా ఎవరితో పరిచయాలు పెంచుకున్నాడో, ఇక్కడికొచ్చి. ఏవైనా, వూరు గాని వూర్లో రామకృష్ణ తిరుగుళ్ళు రిస్కీ నే. ఇట్లా ఆలోచిస్తూంటే నిద్ర పట్టేసింది. గట్టిగా డబ డబా , కిటికీ తలుపులు కొట్టుకుంటున్న శబ్దం వినపడితే లేచాను.ఒక రెండు అడుగులేసి, బయట బాల్కనీ లోకొచ్చి నిలబడ్డా ఒళ్లు విరుచుకుంటూ. చీకటి ముసురుకోనుంది. నెలరోజుల్నించీ నైట్ షిఫ్టు, డే షిఫ్ట్ ఇట్టా మారడం తలనొప్పిగా వుంది. ఇంకా అలవాటు పళ్ళేదు. బాగా నిద్రపొయ్యి , లేచినా మగత గానే ఉంటుంది. ఇది గాక , నా బద్ధకం వల్ల, బ్రెడ్డు పాలతో అలవాటు లేని భోజనం.ఇంకో నాలుగు రోజులు ఈ నరకం తట్టుకుంటే, మా ప్రాజెక్ట్ కమీషనింగ్ అయిపోతుంది. కూత వేటు దూరంలో వుంది సముద్రం, మేముండే లీల కాలనీకి. కాలనీ అంతా కల్పి ఒక రెండు మూడు వీధులు అంతే. అదే కాలనీ ఎంట్రన్స్ లో ఒక అమ్మవారి గుడి. సముద్రం అనుకునే వుండే వీధి లో మా గెస్ట్ హౌస్. బాగా తూగొస్తోంది. దూరం నుంచి సముద్రం హోరు , విపరీతమైన గాలి. గాలి పెరిగిపోతోంది. పొద్దున్న ఫ్యాక్టరీ లో ఎవరో చెప్పారు, ఈ నెల లో తుఫాను వుంది వైజాగుకి అనిచెప్పి.చిన్నగా వర్షం మొదలైంది. ఇంతలో ఎదురు ఇంటి మీద ఎవరో కదిలినట్టు అనిపిస్తే అటు చూసాను. సన్నటి ఆకారం, ఎవరో ఒక ఆడమనిషని అయితే మటుకు తెలుస్తోంది, స్ట్రీట్ లాంప్ వెలుగులో ఓ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. మేడ మీద పిట్టగోడ దగ్గర, చీకట్లో వర్షంలో తడుస్తూ, వీధి వైపే చూస్తూ. అంత చీకట్లోనూ ఆ అమ్మాయి ముక్కుపుడక అనుకుంటా మెరిసిపోతోంది.నా గొడవలో చుట్టుపక్కల వుండే వాళ్ళని పెద్దగా గమనించింది లేదు. ఎదురు ఇంట్లో ఓ యాభై ఏళ్ల మనిషిని అప్పుడప్పుడు ఆయనతో బైక్ మీద వెళ్లే ఒక ఆవిడ్ని చూసా. డాబా మీద నిలబడుంది, వాళ్ళ అమ్మాయి అయ్యుండొచ్చు.ఓ రెండు నిమిషాలు చూసి లోపలికొచ్చేసాను. ఆకలి మొదలవ్వడంతో. రూమ్ లోకి ఎంటర్ అయ్యి, .టైం చూస్కుంటే రాత్రి పదిన్నర దాటింది.వున్న రెండు బ్రెడ్డు ముక్కలూ పీక్కు తింటూ బాల్కనీ లోకి మళ్ళీ వచ్చా.ఎదురు ఇంటి డాబా వైపు చూస్తే, ఎవ్వరూ కనపడలేదు. లోపలికొచ్చి పడుకున్నా. పొద్దున్న లేచేటప్పటికి, రామకృష్ణ కాఫీ, టిఫిన్ పొట్లాలతో రెడీ గా వున్నాడు."ఎన్నింటికొచ్చావు రాత్రి" ?"రెండయ్యింది. సెకండ్ షోకి...