వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు."కథ చెయ్యాల్సిన పని వర్తమానం నించి భవిష్యత్తు గా మారే, పరిణామ క్షణాన్ని (that fleeting moment) , పట్టుకునేందుకు ప్రయత్నించడం. దానికుండే పరికరాలు , similes, metaphors, images, magic realism మొదలైనవి.. అనుకూలమయిన వాటిని ఎన్నుకుని వాడడం లో రచయిత ప్రత్యేకత ప్రతిభ వెల్లడవుతుంది" - శ్రీ. మధురాంతకం నరేంద్ర 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి 'అపరాజిత' అనే కథాసంపుటిలోనిది.ఈ కథ రాసింది, 1964-65 మధ్య కాలంలో. అవి, మధ్యతరగతి కుటుంబాలు , వ్యవసాయాధారిత జీవనాన్ని వదిలేసి, ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలి వెళ్లడం అనే మార్పు మొదలైన రోజులు. కథలో ముఖ్య పాత్రధారి వేణుగోపాల్. అతని 'ఐడెంటిటీ క్రైసిస్' ఈ కథలో ముఖ్యాంశం. అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి. వేణుగోపాల్ ఇబ్బందులు , ఆఫీస్ కు వెళ్ళడానికి బస్సు కోసం క్యూ లో నిలబడ్డప్పుడు మొదలౌతాయి. బస్సుల నిండా జనాలే. రెండు బస్సులు అసలు స్టాప్ లో ఆగకుండా వెళ్లిపోతాయి. మూడో బస్సు ఆగినా అతను ఎక్కేలోపల, బస్సు నిండిపోయి వెళ్ళిపోతుంది. ఈ గోలలో సగం చచ్చి ఆఫీసు కు వెడితే, అక్కడ ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. బాస్ రూంలోకి వెళ్తే , ఆయన మాటల్తో తను ఒక మనిషిని కాదేమో అన్న అనుమానం కలగచేస్తాడు వేణుగోపాల్ కి.సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందర అవసరార్థం ఏదో ఒక షాపు లో అడుగుపెడితే, అక్కడి అనుభవం అతని ఇబ్బందిని తీవ్ర తరం చేస్తుంది.అక్కడ్నించీ ఇంటికి వెళ్లే లోపల , అతనికి సాంత్వన ఎలా లభిస్తుంది అని వివరిస్తూ కథను చక్కగా ముగిస్తారు రచయిత.ఒక సాధారణమైన జీవితం గడిపే మనిషి రోజూ వారీ అనుభవం నించి కథను సృష్టించారు రచయిత. ఈ క్రమంలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగతం అయ్యేలా చేస్తారు.కథలో ముఖ్య పాత్రధారి మానసిక స్థితిని క్రమంగా గట్టిపడే బంకమన్ను తో పోలుస్తారు రచయిత.పాండురంగరావు గారు ఈ కథగురించి మాట్లాడుతూ -"మన నాగరికత విస్తరించిన కొద్దీ వ్య క్తిగా మానవుడు సంకుచించుకు పోతున్నాడు. ఇంకా మన దేశంలో ఈ “మంది” తనం అన్న భూతం నూటికి నూరుపాళ్ళూ విస్తరించలేదు గాని, దాని లక్షణాలు మాత్రం స్పష్టంగా అగుపడుతూనే ఉన్నాయి." అన్నారు. అరవై ఐదు ఏళ్ల క్రితం ఈ కథ రాస్తూ , రాబోయే కాలంలో సమాజంలో వచ్చే మార్పు ను గురించి ముందుగానే...