ప్రణవం ప్రణయం పరిణయం

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది.ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను ఓ తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది.ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు 'ఏందియ్యో' కధ అంటూ వాడి చిత్తూరి మాండలికం మొదలుపెట్టి నే చెప్పేలోపే ముందు ఉత్తరం 'సదూవన్నా' అంటూ నన్నొదల్లేదు.లెటర్ మంచి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీషులో రాసుంది. ప్రస్తావన వాళ్ళమ్మాయి పెళ్లిచూపులు.రెండు కుటుంబాలకు తెలిసిన వ్యక్తి పేరు చెబుతూ అమ్మాయి ఫోటోతో పాటు జాతకం పంపారు. అందులోని గళ్ళు నాకేం అర్థం కాలేదు.వెంటనే అమ్మకో ఫోన్ కొట్టి విషయం చెబితే అప్పుడే పంపించేశారా అంటూ చిన్ని నవ్వుతో నువ్వు ఎప్పుడు ఖాళీ అంటూ అడిగింది. దేనికి అన్నా చేతిలో ఫోటో తదేకంగా చూస్తూ!! అదేంటి.. మరి మదనపల్లె వెళ్ళాలి కదా అంది. సరే సరే నేను రేపు చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ ఫోటో లోకంలో మునిగిపోయా..అమ్మాయి పేరు మధుర ప్రణవి. ఓ ప్రణవ నాదంలా పేరులో ఏదో తెలియని కొత్తదనం. పుట్టిన తేదీ చూస్తే మూడు సంవత్సరాలు చిన్న. వెంటనే నా ఆలోచన "జ్యోతిష్కురాలు లిండా గుడ్ మాన్స్ సన్ సైన్స్" బుక్కు మీద పడిండి. అది మన పుట్టిన రోజు ప్రకారం వచ్చే ఇంగ్షీషు రాశుల గురించి ఆమె రాసిన ప్రఖ్యాత గ్రంధం. ఫోన్ లో ఆ బుక్కు ఓపెన్ చేసి మా ఇద్దరి ఇంగ్షీషు పుట్టిన రోజుల ప్రకారం కుదిరే గుణాల గురించి చదివేయడం, బుక్కులో చెప్పిన పాజిటివిటీయో ఏమో మెల్లగా ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడ్డం మొదలైంది. అమ్మాయి అందంగా ఉంది. ఫోటోలో ఇలా ఉందంటే ఎదురుగా చూడాలనిపించే ఒక తెలియని ఆత్రుత, ఉత్సాహం, నవ్వు నా గురించి నాకు తెలిసిన నా మొహం మీద తెలుస్తోంది.అన్నో ఏంది.. తెగ 'నౌతాన్నావ్' అక్కడ ప్రొడక్షన్ లో సాండల్ ఆయిల్ అయిపోతోంది.. హెడ్ అఫీసుకు ఫోను కొట్టు అని మా చిత్తూరు నాయుడు అంటూంటే వాడి జిల్లాకే అల్లుడైనంత ఆవేశం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. ఫోన్ మోగుతున్న శబ్దం ఆ తెల్లవారి నా నిద్రను డిస్టర్బ్ చేస్తూ నన్ను లేపింది. చూస్తే అమ్మ.. ఫోన్ ఎత్తడంతోనే 'ఏంట్రా రాత్రి సరిగా నిద్ర పోలేదా' అంటూ అదే చిన్ని నవ్వు. అసలు వీళ్ళకు ఇవన్నీ ఎలా తెలుస్తాయో ఏంటో!!సరేలే ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేయి అంటూ నాకు ఓ బ్రేక్ ఇచ్చింది. నేను రెడ్డి నాయుడు ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా కోలీగ్స్ అన్నమాట. అసలు మీకు మా గురించి చెప్పనే లేదు కదా.. మీకు మైసూర్ సాండల్ సోపులు తెలుసుగా.. బెంగుళూరులోని ఆ ఫ్యాక్టరీ లో నేను అసిస్టెంట్ మేనేజర్ గా నాయుడు నా కింద సీనియర్ ప్రాడక్ట్ ఇంజనీర్ గా పని చేస్తూ కలిసే ఉంటాం. అమ్మ మైసూరులో ఉంటుంది. నాన్నే లేరు!! మేం తెలుగు వాళ్ళే అయినా తాతల కాలం నుండి వొడెయార్ మహారాజా వారి సంస్థానంలో సేద తీరాం. మీ అందరికి తెలుసు కదా దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో.. క్లుప్తంగా చెప్పాలంటే మా దేవత చాముండి, మా తియ్యదనం మైసూర్ పాక్, మా దోశె మైసూర్ మైలారి, మా నీరు కావేరి. మా శుభ్రత మైసూర్.. అప్పటికే నాయుడు లేచిపోయి వంటింట్లో ఏవో శబ్దాలు చేస్తున్నాడు . ఏంటదీ అని అడిగేలోపు చేతిలో కాఫీతో గూడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేశాడు. నాయుడు ఏ విషయమైన నవ్వుతూనే మాట్లాడుతాడు..అది ఒక అదృష్టం. ఇద్దరూ వంటలు చేసేస్తాం కానీ ఆ వంటల్లో మా మద్య కత్తులు నూరుకునేంత వివాదం ఒకటుంది. అదే "ఉబాసం" ( ఉప్మా బాధితుల సంఘం ), "ఉప్రేసం" ( ఉప్మా ప్రేమికుల సంఘం ) పదాలు. నేను మొదటి దాని ప్రెసిడెంటు అయితే వాడు రెండో సంఘానికి. ఇది తెగని గొడవ. నా ఖర్మ కు ఆ రోజు టిఫిను ఉప్మానే. నాయుడు ఆ కాంక్రీటు చాలా ప్రేమతో చేసి నన్ను చూస్తూ కన్ను కొట్టాడు. నాకు అది చూస్తే పరమ చిరాకు. ఏవో నాలుగు స్పూన్లు లోపలికి తోసి అమ్మకు ఫోన్ చేశా.. ఉభయకుశలోపరి అయ్యాక అమ్మ అసలు విషయం చెప్పింది. ఫలానా వారి బంధువులట. నేను ఫోటో చూసా.. నీకు నచ్చితే వెళ్ళి అమ్మాయిని చూసి రావొచ్చు అంది. ఎప్పుడు వెళ్ళాలి అన్నా. శుక్రవారం రోజు బాగుంది రా నీకు వీలౌతుందా! లీవ్ పెటాలేమో కదా లేకపోతే ఇంకో రోజుకు మారుద్దామా.. వాళ్ళకి చెప్పాలి కదా అంది. ఏదో ఆలోచిస్తుంటే నాకైతే శుక్రవారమే బాగుంది ఇక నీ ఇష్టం.. సాయంత్రం...