'వంశీ' గారి 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది.(ఈ కథపై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి. https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/)ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు.ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన గోదావరి తీరం నేపధ్యం గా ఈ కథ సాగుతుంది.ఈ కథ , అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన 'ఖచ్చితంగా నాకు తెలుసు' అనే వంశీ గారి కథా సంకలనం లోనిది. వంశీ గారు 250కి పైగా కథలు రాసారు. ఈ కథల్లో ఇరవై ఐదు చక్కని కథలను ఆయన ఎంపిక చేసి , ఈ కథా సంకలనం లో చేర్చడం జరిగింది.ఈ కథలకు బాపు గారు వేసిన బొమ్మలతో అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలాఅందంగా ముద్రించారు. ప్రతి తెలుగువాడి ఇంటి గ్రంధాలయంలో ఉండాల్సిన పుస్తకం ఇది.ఈ పుస్తకం కొనదలచుకున్న వారు, క్రింద ఇచ్చిన వెబ్ లింక్ లేదా నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్) అడ్రస్ లను గమనించగలరు.ఈ కథ పై మీ అభిప్రాయాలను తెలియజెయ్యడానికి 'హర్షణీయం' వెబ్ సైట్ ని క్రింది లింక్ ద్వారా విసిట్ చెయ్యండి.పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(https://www.facebook.com/AnvikshikiPublishers/)ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.https://www.telugubooks.in/collections/vamsi/products/kacchithanga-naaku-thelusuలేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.నవోదయ బుక్ హౌస్3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్ఫోన్ నెంబర్: 090004 13413https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outro BGM Credits:Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy