ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు ముందుకేస్తే, మియాపూర్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి వుంది, లిఫ్ట్ కూడా ఉందిగా, ఏమి మాయ రోగం వీళ్ళకి రోడ్ కి అడ్డం గా దాటక పోతే అనుకుంటూ, విసుగ్గా వెహికల్ స్లో చేసి వాళ్ళు దాటాక ముందుకు కదిలా. జె.ఎన్.టి.యూ సిగ్నల్ దాటాక ఎర్రగడ్డ మీద కాకుండా అయ్యప్ప సొసైటీ మీద వెళదామని, విశ్వనాథ సినిమా దాటాక వచ్చే యూ-టర్న్ తీసుకుందామని రైట్ ఇండికేటర్ వేసి యూ-టర్న్ తీసుకుంటున్నా, ఇంతలో ఓ బండోడు స్కూటర్ లో నా వెహికల్ కి, మెట్రో పిల్లర్ కి, వుండే గ్యాప్ లో నాతో పాటు పార్లల్ టర్న్ తీసుకోవాలని దూరుతున్నాడు, ఆడిని దూరనివ్వకూదని ఆ గ్యాప్ ని ఇంకొంచెం నారో చేస్తూ టర్న్ తీసుకున్న. ఎప్పుడు నేర్చుకుంటారో ఈ వెధవలు ఒక వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు పార్లల్ గా టర్న్ తీసుకోకూడదు అని తిట్టుకుంటూ ముందుకెళ్లా. జె.ఎన్.టి.యూ దగ్గర, రైతు బజార్ దగ్గర, మంజీరామాల్ కి ముందు, ట్రాఫిక్ బాగానే వుంది కానీ, ఒక్క సారి ఫ్లై ఓవర్ ఎక్కగానే కాస్త తగ్గింది ట్రాఫిక్. ఎలాగూ ఆ ఫ్లై ఓవర్ దిగాక ఆ ఎదవ మలేషియన్ టౌన్ షిప్ దగ్గర ట్రాఫిక్ తప్పదు అనుకుంటూ ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న, అంతలో నా ముందు ఒక డొక్కు ఆర్.టి.సి బస్, ఎడమ లేన్ నుండి నా లేన్ లోకి ఏమాత్రము ఇండికేషన్ లేకుండా వచ్చేస్తున్నాడు. ఒరే నేనున్నాను రా! ఈ లేన్ లో ఆల్రెడీ, నన్ను వెళ్లనివ్వరా, నేనెందుకు ఆగాలిరా నీకొసం, అనుకుంటూ వాదుగా ముందు కెళ్లాలని చూశా . వాడిదేం బోయా! సగం బస్ నా లేన్ లోకి తెచ్చేసాడు. ఎంజేద్దాం! బస్సుతో పెట్టుకుంటే పడేది మనకే బొక్క అనుకుంటూ ఆగక తప్పలా నాకు. జూబిలీ హిల్స్ కి చేరేసరికి ఇటువంటివే మరల మరల పునరావృత్తమవుతూ నా ఓపిక తినేసాయి. ఉసూరుమంటూ సుప్రియా అక్క వాళ్ళింటికి చేరేసరికి, అక్కడ నాకు వాళ్ళు మేము సెకండ్ షో కి వెళ్తున్నాము , నీతో ఇంటికి రాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నీకీ మాత్రం చెప్పటమే గొప్ప అన్న విధంగా. కావాలంటే భోజనం పెడతాం తిని ఇక్కడన్నా తొంగో లేక ఉదయాన్నే నీ ఆఫీసుని ఉద్ధరిద్దామని అనుకుంటే ఇప్పుడే కొంపకు పో అని ఆఫర్ ఇచ్చారు. చూడు నాకు మా అక్క చాలా మూటా ముల్లె ఇచ్చింది, అది మన ఇంటికి రావాలంటే నీ వెహికల్ వొదిలేసి వెళ్ళు, నేను రేపు ఆ మూటా ముల్లె వేసుకొని వస్తా అని అల్టిమేటం ఇచ్చింది సుప్రియా,. సరే నా కొంపకు పోయి, నే హాయిగా ఉంటా అని అనుకోని, వాళ్ళ అక్కకొడుకుని అడిగా, నన్ను మెయిన్ రోడ్ దాకా డ్రాప్ చేయరా బాబు అని. వాడికి సినిమా టైం అవుతుంది , స్కూటర్ లో అయితే తొందరగా డ్రాప్ చెయ్యొచ్చు అని స్కూటర్ తీసాడు. తెలివిగల్లోడు వాడు నా నస తప్పించుకోవొచ్చు అని నన్నే డ్రైవ్ చేయమంటారు ఎప్పడూ. సరే బయలు దేరాం యూ-టర్న్ ని సర్రుమని కార్ కి పిల్లర్ కి మధ్య గాప్ లో పార్లల్ గా తిప్పేసా. మా వోడు బాబాయ్, అలా తిప్ప కూడదు అంటూ మొదలెట్టాడు ,సర్లే రా ఆ బండ కారోడు వాడిదే పెద్ద కారు అనుకుంటూ ,అంత పెద్ద టర్నింగ్ రేడియస్ తీసుకుంటూ ఉంటే, మనకి టైం అయిపోవటంలా అంటూ దూసుకెళ్లిపోయా. వాడు వాడి తలకొట్టుకోవటం మిర్రర్ లో కనిపించింది. మెయిన్ రోడ్ లో దింపి వాడు సక్కా బోయాడు ఎనక్కి తిరగకుండా. ఇంతలో లింగంపల్లి బోయే బస్సు వచ్చింది, ఎక్కేసా. విండో సీట్ దొరికింది, ఏసీ బస్సు కావటంతో సౌలభ్యంగా వుంది. ఆహా! హాయిగా వుంది ప్రయాణం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జిందాబాద్, ఒక్క బస్సు నలభై మందిని తీసుకెళ్తుంది అంటే పది కార్లకి సమానమబ్బా, దీనికి రోడ్ మీద మహారాజ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవడైనా , ముందు బస్సు తర్వాతే ఏదైనా, కార్లైనా గీరైనా అని ఆలోకాహ్నాలలో మునిగిపోయా. ఇంతలో మా వోడు పక్క లైన్ లోకి తిరుగుతున్నాడు, ఎనక నుండి కారోడు భయ్ మంటూ హార్న్ కొడుతున్నాడు. బుద్దిలేనోడా! నీ కారేంత బే, అందులోను అన్నీ బస్సులకు ఇండికేటర్స్ వుండవు, బస్సుల బ్లైండ్ స్పాట్ చాలా పెద్దది, అస్సలకి నువ్వు వెనకున్నవని ఎవడికి ఎరుక బే , ఐన ఈ జనాలెప్పటికీ