మా వాకాటి కథల్లో అశోక్ గాడు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
మాది ఇంజనీరింగ్ లో 1988-1992 బ్యాచ్. మా బ్యాచ్ మొదటినుండి మిగతా బ్యాచ్ ల కన్నా విభిన్నం. మాలో మేము కలివిడిగా వుండేవాళ్ళము, ఆట పాటల్లోనూ, చదువు సంధ్యలలోను మెరుగ్గా రాణిస్తూ. మేము కాలేజీలో వున్నంత వరకు మేమే ప్రతీ సంవత్సరం ఓవరాల్ చాంపియన్షిప్ ని కైవసం చేసుకున్నది. మా అయ్యవార్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనే వారు మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్టక ముందు దాకా, ఎగ్గొట్టేసాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ని ఇంత వరకూ చూడలేదు, చూడబోము కూడా అని తేల్చేశారు. మా సహాధ్యాయుడైన అశోక్ యెడ్లగాడు మొదటినుండి అందరికీ ఆత్మీయుడే. తన నవ్వుతో, కలివిడి తనంతో, మంచితనంతో అందరితోనూ చాలా ప్రేమపూర్వకంగా మెలిగేవాడు. మాలో చాలా మందికి వాడు సన్నిహిత మిత్రుడు. అందరిలాగే మేము కళాశాల చదువులు అయ్యాక వేళ్ళ మీద ఎంచదగ్గ వారితో తప్ప మిగతా వారితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాము. అప్పటిలో కొద్దిమందికే ల్యాండ్ లైన్ సదుపాయం ఉండెడిది, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్స్ అప్ సమూహాలు లేవు. క్రీ || శ 2000 సంవత్సరమనుకుంటా, నేను డెన్వర్లో ఉండగా, మామ! అంటూ ఫోన్ చేసాడు వాడు. నా ఫోన్ నెంబర్ ఎలా పట్టాడురా వీడు అని ఆశ్చర్యపోతూ, ఏరా! ఎక్కడున్నావు, ఏమిటి విశేషాలు అంటే, నేను గత వారమే డెన్వర్ వచ్చానురా, ఫ్రెంచ్ క్వార్టర్స్ లో వుండే మా కంపెనీ గెస్ట్ హౌస్ లో వున్నా, వచ్చి కలువు అన్నాడు. ఓరి నీ పాసు గూల, వచ్చి వారమయ్యాకరా! నువ్వు నాకు కాల్ చేసేది, వచ్చే ముందు చేయలేక పోయినా, రాగానే అన్నా చేయాలి కదరా అంటూ వాడిని కలవడానికి వెళ్ళిపోయా. సుప్రియాకి వాడిని పట్టకొస్తా మాకేమన్న ఉడకేసిపెట్టు అని చెప్పి. వాడిని చూడగానే చాలా సంతోషం వేసింది, వాడు కూడా అలాగే వున్నాడు గల గలా మాట్లాడుతూ. వాడితో పాటే ఆ గెస్ట్ హౌస్ లో దిగిన సర్దార్జీని పరిచయం చేశాడు. కొంచెం సేపు మాటాడుకున్నాక అశోక్ గాడిని మా ఇంటికి పట్టకెళ్ళిపోయా నేను. దార్లో చెప్పాడు వాడు, ఇంజనీరింగ్ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసాడని, అటుపిమ్మట, అమెరికాలో ఉంటున్న కన్సల్టెంట్ H1 స్పాన్సర్ చేయటంతో, ఇక్కడ తేలాడు అని. నాకు చెప్పొద్దూ! మనమేమో తెగ సూపర్ అయినట్టు ఆపైన ఇక్కడికి వచ్చి ఎదో సాధించేసినట్టు, వాడేదో చాలా అమాయకుడు, ఏమీ తెలియని వాడు అయినట్టు, ఎందుకు వచ్చాడురా నాయనా యీ .కామ్ బూమ్ అంతా ఢమాల్ అయిపోయిన కాలం లో, అదీ జావా మీద, కష్టాల్లో పడిపోతాడు అని దిగులేసిపోయింది. వాడిని తరచి తరచి అడిగా వాడి అనుభవం గురుంచి మరియు వాడి కంపెనీ గురుంచి, వాడు విసుక్కొనే దాకా నువ్వూ నీ ఎదవ అనుమానమని. అలా వచ్చిన అశోక్ గాడు, సుప్రియాని అమ్మాయీ అని పిలుస్తూ, సుప్రియాకి మరియు పిల్లలకి చాలా దగ్గరైపోయాడు. నేను వాడిని తరచుగా కలిసే వాడిని మరియు వాడిని భోజనానికి ఇంటికి పట్టకెళ్లిపోయేవాడిని. ఒక రోజు వాడి రూమ్ కి వెళ్లిన నాకు, వాడి కొత్త రూమ్ మేట్ తలుపు తీశాడు, సర్దార్జీ లేడు రూమ్ లో, నాక్కూడా చాలా సంతోషమేసింది, వాడిక్కూడా వుద్యోగమొచ్చి వెళ్లిపోయాడేమో అని, ఎందుకంటే వాడు చాలా రోజులుగా బెంచ్ లో వున్నాడు కాబట్టి. అదే విషయం అశోక్ గాడిని అడిగా, వాడు నవ్వుతూ, హర్షాగా! వెళ్లి వాడిని ఇంకోమారు చూసి రారా అన్నాడు. ఏందిరా సంగతి అని వెళ్లి చూద్దునుగా ఆ తలుపు తీసింది క్లీన్ షేవ్ లో వున్న మా సర్దార్జీనే. వాడికీ ఉద్యోగమొచ్చేసింది. అశోక్ గాడు తీరిగ్గా నవ్వుతూ చెప్పాడు, వాడసలు అమెరికా వచ్చింది దీనికోసమేరా, ఇప్పటి దాకా భరించాడట వాడు, ఇక వాడి వల్ల కాదని ఇలా అవతరించాడు అని. మా సర్దార్జీకి ఉద్యోగమొచ్చిన సందర్భం గా వాళ్ళ ఫ్రెంచ్ క్వార్టర్స్ కి మాత్రమే గర్వకారణమైన ఇన్డోర్ వార్మ్ వాటర్ పూల్ లో తెగ ఈత కొట్టేశాము ఆరోజు మేము ముగ్గురమూ. అశోక్ గాడికి ప్రతిదీ ప్రశ్నయే, మన ముందు జుట్టు పెంచుకున్న మగవాడు వెళ్తుంటే, ఒరే, హర్షాగా! ఆ వెళ్ళేది అమ్మాయా లేక అబ్బాయా అనడిగే వాడు. నాకు మండి, నీది అమాయకత్వమా లేక ఇంకోటి ఏదన్నానా అని కయ్యి మనేవాడిని. సర్లేరా బాబూ! నీకంత కోపమైతే ఇలాటి ప్రశ్నలు అడగనులేరా అని చెప్పేవాడు వాడు. అశోక్ గాడి దృష్టి యిక వాడి వాహన చోదక కళని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మీద పడింది. నన్ను తెగ నస పెట్టటం మొదలెట్టాడు. నేను తప్పించుకోవాలని చూశా, అక్కడ చోదక నియమాలు చాలా ఎక్కువ అనే సాకు పెట్టి. కానీ వాడసలు వొదల లేదు, నాకసలు తప్ప లేదు. సరే వాడికి తోలడానికి అనుమతి ఉంది, పక్కన తోలటం వచ్చిన వాడు ఉండగా వాడు తోలవచ్చ