అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ భార్య విధేయుడివి) అని ఈసడిస్తాడు అప్పుడప్పుడు. ఆయనకు పెద్ద ఫీల్ అంతా ఆయన కంట్రోల్ లోనే నడుస్తుందని. వీళ్లకు తెలీదు, అంతేగా అంతేగా అంటే, వాళ్ళు ఎంత సంతోషించి ఎన్ని సేవలు చేసేస్తారో. నాకైతే ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే టిఫిన్లు భోజనాలు కూడా నోటికే. తిని నా మూతి నేను కూడా కడగనబ్బా. జీతం రాగానే ఇంత అని తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటమే నా పని. ఇంట్లోకి అన్నీ, అమ్మ నాన్నల మందులు, పిల్లల పికప్ డ్రాప్ ఆఫ్, వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ అన్నీ తనే. అబ్బా నువ్వు సూపర్ అంటే, కార్ తోలటం నేర్చేసి అన్నీ తనే వన్ వుమన్ ఆర్మీ లాగా. ఎవరన్నా బంధువులు వచ్చినా పిక్ అప్ డ్రాప్ ఆఫ్ అన్నీ ఆమెనే. మన పని ఆఫీస్ కి వెళ్ళటం, రావటం పిల్లల చదువు చూడటం అంతే. మీరు ఏమంటారు, అంతేగ అంతేగ అని వాళ్ళ చిన్న మాటలను ఓపిగ్గా వింటూ వింటే కలిగే బోలెడు లాభాలు . ఇక మీకు తెలుసు అనుకుంటా మీ ఇంట్లో కూడా మీరు ఎలా ఉండాలో. కాదూ కూడదు నేను పురుష పుంగవుడిని నేనింతే అని మా అన్నలా వున్నారా, దేవుడే కాపాడాలి మిమ్మల్ని. నా మాట విని కనీసం లాక్ అవుట్ అయినదాకా అన్నా నటించండి, ఆ తర్వాత మీకే అలవాటైపోతుంది.