'నారింజ రంగు సిరా మరకలు' - మహి బెజవాడ ! పార్ట్ - I
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
రచయిత పరిచయం:వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానిని విజువలైజ్ చేయడానికి రాస్తే బాగుంటుందని రాస్తున్నాను' అంటారు.'నారింజ రంగు సిరా మరకలు', ఒక విలక్షణమైన కథ. 'అస్తిత్వ వేదన' ముఖ్యాంశం గా వచ్చిన కథలు వున్నప్పటికీ, రాసిన పద్థతి వల్ల ఈ కథ ప్రత్యేకతను సంతరించుకుంది. కథ చాలా మటుకు విజువల్స్ ప్రెజెంట్ చేస్తూ, సింబాలిక్ గా రాస్తూ వస్తారు రచయిత. కథంతా భావగర్భితంగానే ఉంటుంది.కొన్ని కథలు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిలిస్తే, కొన్ని కథలు ఆలోచింప జేస్తాయి. ఈ రెంటిని సాధించగలిగారు మహి ఒకే కథలో.ఆడియో పార్ట్ 1 లో , కథను మీరు వినవచ్చు.ఆడియో పార్ట్ 2 లో , కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.‘నారింజ రంగు సిరా మరకలు’in a highly disturbed state of mind. అతను మానసికంగా చాలా అలజడికి గురవుతున్నాడు. అసలేం జరిగింది ఇతనికి?తెల్లని గోడల మధ్య పుస్తకాల గుట్టలు. రాత్రంతా నిద్దురపోడు. అతను దేనికోసమో తపిస్తాడు. ఏదో దొరకని దానికోసం వెతుకుతుంటాడు. ఆ వెతుకు లాటలో భాగంగా చదువుతుంటాడు. చాలా దూరం చదువుతుంటాడు. పగలూ రాత్రి కనబడని దూరం చదువుతుంటాడు. అంత దూరం చదివి, రాయడమేమజిలీగా పెట్టుకుంటాడు. మళ్లీ పగలూ రాత్రి కనబడనంత దూరం రాస్తాడు. మళ్లా వెతకడం మొదలుపెడతాడు. చరిత్ర, పాలిటిక్స్, ఫిక్షన్- ఒకటని కాదు. రోజూ ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇవన్నీ చూస్తూ ఒక మూలగా ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై గుబురు గడ్డం ముసలివాడు సాక్షిగా వుంటాడు. ఈ రాసిన కాగితాలన్నీ అచ్చుకు పోతాయి. పత్రికలవుతాయి, కరపత్రాలవుతాయి. కానీ చదివిన పుస్తకాలన్నీ తన బుర్రలో శిథిలమవుతాయి. చరిత్ర చదివి బాధపడతాడు. కోపం తెచ్చుకుంటాడు. తనలో తాను మథనపడతాడు. చివరికి కథ చెప్పాలంటాడు. అతడు కథ భలే చందంగా చెబుతాడు. తనకిష్టమైన వెన్నెల రాత్రులలో దగా చేసి రాయబడ్డ మన గతాలను ఆ నక్షత్రాల సాక్షిగా చెబుతాడు. మనం మనం కాదు. ఎవరి కోసమో రాయబడ్డ చరిత్ర. చరిత్రను తిరగరాయాలి. మన గురించి మనమే రాసుకోవాలి అంటాడు.Not a rare case. But sounds strange.మొదట్లో నాకూ వింతగా అనిపించింది. డిప్రెషన్ అనుకున్నాను. కానీ అనుకోకుండా మారిపోయాడు. ఇప్పుడు అన్నింటికీ భయం భయంగా వున్నాడు.తనలో తనే వున్నాడు. ఈ లోకంతో పని లేనట్టు తన రూమ్ నుండి బయటకు రావట్లేదు. తన బులుగు రంగు జేబురుమాలును చేతిలోనే వుంచుకుంటున్నాడు. రాత్రుళ్లు గట్టిగా అరుస్తున్నాడు. ఎవరో తన మీద నిఘా పెట్టారంటూ మంచం కింద దాక్కుంటున్నాడు. కానీ చదవడం ఆపలేదు. రోజూ పేపర్ చదువుతున్నాడు. తన పుస్తకాలు చదువుతాడు.కానీ రాయట్లేదు.రాయడానికి భయం అడ్డుపడుతుంది. కానీ రాస్తున్నాడు. ఎవరికీ కనబడకూడదని రాసిన కాయితాలన్నీ అటక పైన వున్న పాత ట్రంకె పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాడు. అప్పుడప్పుడు తన బులుగు రంగు చేతిగుడ్డను ముఖంపై కప్పుకుంటాడు. ఏడుస్తాడు. ఇదంతా ఆ గుబురు గడ్డం ముసలి మనిషి చుస్తూవుంటాడు.ఇలాగే వుంటే అతని పరిస్థితి ఏంటి డాక్టర్?It all depends. ఈ అలజడి ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకి దారి తీయడానికి అవకాశం వుంది. ఏమీ జరగకుండానే ఇలానే పిచ్చిలోకి జారిపోయే ప్రమాదమూ వుంది.అతను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా? దీనికి ఏ రకమైన ట్రీట్ మెంట్ లేదా డాక్టర్?ట్రీట్ మెంట్ అంటే, ఇది మందులతో మాత్రమే నయం కాని స్థితి. ఇది మనసుతో చెయ్యా ల్సిన వైద్యం . But it's not a hopeless condition. అయితే అతన్ని మాములు మనిషిని చేసే ప్రయత్నం కేవలం ఒక్కరికే సాధ్యం.ఎవరు డాక్టర్?తనే! Yes he only can cure himself. ఈ పరిసరాలు ఇవీ మారి తన కిష్టమైన చోటుకు తీసుకెళ్లి తనకు అడ్డు చెప్పకుండా తను ఇష్టపడే పనులు తనను చెయ్యనివ్వండి. తను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. తనలో వుండే ఇమేజెస్ ని మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన మాట మీరు వింటున్నారు అంటే తనలో కూడా ఏదైనా మార్పు రావొచ్చు. But it's a long shot!Ok, Thank You, Doctor!గ్త్ ఎఫెకు పెట్టాను.మనం నీకిష్టమైన కన్యాకుమారి వెళ్తున్నాం. ఢిల్లీ టూ ఆగ్రా,...