గ్యాపకాలు

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

"భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు. లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని మరీ బాపట్ల కాలేజీ లో చేరాడు.మీ పెద్దమ్మ లిద్దరి కంటే గూడా నేనంటేనే ఇది.నాక్కొక్కదానికే రాసే వాడు జాబులు. "నాయన దగ్గర పొలం పని నేర్చుకోడం మంచిదయ్యిందే, నేనేవో వీళ్ళు చెప్పే పనులు ఎడం చేత్తో చేసేస్తూంటే, మిగతా వాళ్ళందరూ తెగ ఇబ్బంది పడ్తున్నారని" జాబుల్లో రాసేవాడు .చదువైనా, ఉజ్జోగం అయినా అన్నిట్లో ఫస్టు.మనిషి మొండోడులే, మీ పెద్దమ్మకి శేష పెదనాయన సంబంధం ఖాయం చేస్తూంటే ఎంత గొడవ చేసాడని, శేష బావ నలుపు, మా అక్క అంత అందగత్తెకి ఆయన్నిచ్చి ఎట్టా చేస్తారు అని ఒకటే గొడవ. గొరస కత్తి ఒగటి ఎత్తుకొని, కనపడిన తాటి చెట్టు కల్లా గాట్లు పెట్టుకుంటా పొయ్యాడు. ఈయన్నిశాంత పరిచే కాడికి తాతలు దిగొచ్చారు. ఒక్కడే కొడుకు అని చెప్పి, మా అమ్మ గూడ అట్టే చూసేదిలే మీ రాం మావని. డబ్బులు చాలక ఇబ్బంది పడుతూంటే, ఎన్ని సార్లో , నాయనకి తెలీకుండా, వడ్లమ్మి ఎం.ఓ చెయ్యించేదో మా అమ్మ."టోల్ గేట్ కనపడుతోంది దూరంగా. కారెక్కినప్పట్నుంచీ అమ్మ ఇట్టా మాట్లాడ్తూనే వుంది. అడిగా వెనక అద్దంలోంచి అమ్మను చూస్తూ ."కాఫీకి ఆపేదా పిడుగురాళ్లలో " నాన్న ఏదో చెప్పబొయ్యే లోపల అమ్మే అనింది, "మావ దగ్గరకి పొయ్యే దాకా ఎక్కడ ఆపే పనే లేదు రా" రాత్రి నెల్లూరు నుంచి మావ గురించి ఫోన్ వచినప్పట్నుంచీ, అమ్మ అదొక ట్రాన్స్ లోకి వెళ్లి పొయ్యింది. వాళ్ళ అన్న గురించి అవే అవే మాటలు. అన్నీ వాళ్ళ చిన్నప్పటి మాటలు. వింటున్న నాకూ, నాన్నకూ, ఆమె చెప్పే విషయాల్లో తెలీనివి ఏవీ లేవు. కానీ, అమ్మమ్మ దగ్గరే, వూళ్ళో చాలా ఏళ్ళు పెరిగిన నాకు, , మా రాం మావ తో వుండే గ్యాపకాలు వేరు. అప్పుడు ఆయన ఉద్యోగం నెల్లూరు అన్నట్టే గుర్తు. మా అత్త ను గూడ తీసుకు రాకుండా, స్కూటర్ వేసుకొని ఊరి కొచ్చి, ముందర ఇంటికి రాకుండా, నేరుగా పక్కీధి లో వుండే మా శంకర అవ్వ వాళ్ళింటికి పొయ్యేవాడు. నేను అమ్మమ్మ ను ఏడిపిద్దామని అనేవాణ్ణి."అమ్మమ్మా, శంకర అవ్వ వాళ్ళింట్లో ఫ్యాను కింద కూర్చొని, చక్కెర కాఫీ తాగుతుంటే, వుండే మజా, నీ దగ్గరొకొచ్చి విసనకర్రతో ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తాగే, బెల్లం కాఫీలో ఏవుంటుంది అని." "రేయ్ వేలెడంత లేవు, నువ్వేన్దిరా వాడి గురించి మాట్లాడేది, ఎంత పెద్ద ఉజ్జోగంలో వున్నాడు తెలుసా."ఇదిగాక మావ వొచ్చిన ప్రతీ సారీ, మా అమ్మమ్మ, ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటికి తీసుకెళ్లామని అడగడం, నెల్లూళ్ళో ఆ గోలలో నువ్వు ఒక్క రోజు కూడా వుండలేవే అని మా మావ దాటెయ్యడం నా కళ్ళ ముందే జరిగేది. "అవును అమ్మమ్మా, అంత పెద్ద ఉజ్జోగం చేసే మావ, అంతకంటే పెద్ద ఇల్లు కట్టాడు కదా, నెల్లూరులో, పిలిచి చూపిచ్చాడా ఎప్ప్పుడైనా""రేయ్ వందమంది పని చేస్తార్రా, మీ మావ చేతి కింద. ఊపిరాడని ఉజ్జోగం. అయినా గూడా నెల నెలా నాకోసం వూరొచ్చి, మందులు పళ్ళు తెచ్చిచ్చి పోతాడు తెలుసా." అనేది మా అమ్మమ్మ, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే, పొడిగించేవాణ్ణి కాదు నేను అక్కణ్ణించీ.మా అమ్మమ్మ పొయ్యినప్పుడు గూడా, పిల్లలలకి పరీక్షలు అనిచెప్పి, వాళ్ళను తీస్కరాకుండా, మా మావ, అత్తా నే వచ్చి చిన్న కర్మ పెద్ద కర్మ మరునాడే చేసేసి వెళ్లిపోయారు. ఊపిరాడని ఉద్యోగం కదా మావది !ఆ తర్వాత నేను వాళ్ళను పెద్ద కల్సింది లేదు. మా కుటుంబాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సార్లు చేతులు అందిచ్చుకున్నా, మా అమ్మా పెద్దమ్మలిద్దరి మధ్యలోనే, ఆయన ప్రమేయం లేకుండానే , అంతా నడిచిపోయింది. నెల్లూరులో వుండే బంధువుల ద్వారా మావ వాళ్ళ విషయాలు అయితే తెలుస్తూ ఉండేవి. ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద పొసిషన్ లో రిటైర్ అయ్యాడనీ, ఇద్దరూ కొడుకులూ స్టేట్స్ లో చదువులూ, ఉద్యోగాలతో పాటూ అక్కడ అమ్మాయిల్నే చేసుకొని, సెటిల్ అయిపొయ్యారనీ. మా మావ కొడుకులు పెళ్లిళ్లు అయ్యాక ఇండియా కి...