part - 1 :పుస్తక ప్రేమికుడు అనిల్ బత్తుల గారితో హర్షణీయం
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
Part - Iఅనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి వచ్చిన సినిమా పై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం పిల్లల సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ సినిమాలను 25 చిత్రాలను ఎంపిక చేసి , వాటి మీద ఒక పుస్తకం రాసి ప్రచురించారు. ఇప్పుడు ఆ పుస్తకం రెండో భాగం రాస్తూ, దాంతో బాటూ తాను తీయబోయే పిల్లల సినిమా స్క్రిప్ట్ వర్క్ లో మునిగి వున్నారు.ఈ ఇంటర్వ్యూలో , అనిల్ తన జీవితంలో పుస్తకాల పాత్ర గురించి , తన మోటివేషన్ ఫాక్టర్స్ గురించి, తెలుగు పిల్లల సినిమా, పిల్లల సాహిత్యం , తాను తీయబోయే సినిమా గురించి మాట్లాడటం జరిగింది.అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. : http://bit.ly/anilbattulapillalacinemakathaluఆయన సేకరించిన సోవియెట్ పుస్తకాల ఫ్రీ డౌన్లోడ్ కి – http://sovietbooksintelugu.blogspot.com/‘శారద’ నటరాజన్ గారి గురించి: https://sahithyabatasarisarada.blogspot.com/హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy