part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)గాలివాన’మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వున్న నలుగురు ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కాని కూలివాడు ఆయన బెడ్డింగూ, పెట్టె, గొడుగు పైబల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్దమనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు.నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించారు. బూట్లు మేజోళ్లతో సహా బల్లల క్రిందకు తోసివేయబడి వున్నాయి. కోట్లు, పాంట్లు, చొక్కాలు పై కొంకెలకు తగిలించి వున్నాయి. వదులైన పైజామాలను ముగ్గురు మగప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ యిటూ అటూ తొందరలేనట్టు పరచి ఉన్నాయి. కిటికీల పక్కనివున్న రెండు మెత్తలమీద ఇద్దరు పెద్దవయసువాళ్ళు కూచున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆయనకు భార్య అయిఉంటుంది. సిగరెట్టు పొగ మెత్తనిఘాటు రావుగారి నాసికారంధ్రాలలోకి తెలియకుండా ప్రవేశించి ఒకక్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.రైలు పెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమయిన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమయిన అభిప్రాయా లున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకొక అభిమాన సిద్ధాంతముంది – వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ, అనుబంధించి వుంటుందని ఆయన వాదము. ఆయన ప్రకారం, వేదాంతానికి, జీవితానికీ, నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమయిన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమయిన ఉత్సాహంతోటీ పవిత్రమైన ఉద్రేకంతోటీ మాట్లాడగలరు.   ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచివక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ...